నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. అయితే, అలేఖ్యా రెడ్డి జ్ఞాపకాల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకు ఉదాహరణ... లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్!


ఈ జీవితానికి నువ్వూ, నేను!
దివంగత కథానాయకుడు తారక రత్నతో కలిసి దిగిన ఫోటోను ఆయన సతీమణి అలేఖ్యా సోషల్ మీడియాలో ఈ రోజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి ''ఈ జీవితానికి నువ్వూ నేను మాత్రమే! జీవితానికి సరిపడా జ్ఞాపకాలను ఇచ్చి వెళ్ళావు. వాటితో నేను ముందుకు వెళతాను. నా చివరి శ్వాస వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను'' అని క్యాప్షన్ ఇచ్చారు.


Also Read : రజనీకాంత్ నిజాలే మాట్లాడతారు, 100% కరెక్ట్... వైసీపీలో ఇష్యూలో జగపతి బాబు మద్దతు






మరొక పోస్టులో తారక రత్న చిన్ననాటి ఫోటోను, తమ కుమారుడి ఫోటోను అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు. తన జీవితంలో స్టార్లు వీళ్ళేనని పేర్కొన్నారు. ఒక్క సెకన్ కూడా తారక రత్నను మర్చిపోయే ప్రసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు.


Also Read డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!   


పెద్దైన తర్వాత తండ్రిలా...
తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. ఓ అబ్బాయి! పెద్ద అమ్మాయి పేరు నిష్క. ఆమె గురించి తప్ప తారక రత్న మరణం వరకు మిగతా ఇద్దరి గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. అలాగే, అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియా ఖాతాలను అనుసరించే వారి సంఖ్య కూడా తక్కువే. తారక రత్న మరణం తర్వాతే వాళ్ళ మీద ప్రజల దృష్టి పడింది. 


కొన్ని రోజుల క్రితం అబ్బాయి ఫోటోలను అలేఖ్యా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో షేర్ చేశారు. అందులో తండ్రి ఫోటోతో వారసుడు ఉన్నారు. పెద్దైన తర్వాత తండ్రిలా కావాలని అబ్బాయి అంటున్నట్లు అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. 



నిష్క (Taraka Ratna Daughter Nishka) కూడా ఆ మధ్య సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు. తండ్రితో గేమింగ్ ఆడుతున్న వీడియో షేర్ చేశారు. తండ్రి తారక రత్నతో దిగిన ఫోటోను నిష్క పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె తొలి పోస్ట్ అదే. ఆ ఫోటోకి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ రెండు లవ్ ఎమోజీలను యాడ్ చేశారు. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫోటో పోస్ట్ చేశారు. ''మై పేరెంట్స్! వీళ్ళే నా బలం, నా ప్రేమ'' అని నిష్క పేర్కొన్నారు. ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.






తారక రత్న ఫిబ్రవరి 18న మరణించారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న అలేఖ్యా రెడ్డి, ఆ తర్వాత నుంచి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణను దేవుడిగా వర్ణించారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలో తారక రత్న పేరు మీద ఓ బ్లాక్ ఓపెన్ చేయడంతో ఆయనది బంగారు మనసు అని పేర్కొన్నారు. దానికి కొన్ని రోజుల ముందు తమ దంపతులపై వివక్ష చూపించారని పేర్కొన్నారు.