సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఉంటున్నది తమిళనాడులో! ఆయన ఓటు హక్కు ఉన్నది కూడా తమిళనాడులో! అయితే, గత కొన్ని రోజులుగా ఆయన పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారుమోగుతోంది. అందుకు కారణం ఏమిటి? అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శక పురుషుడు ఎన్టీ రామారావు (NT Rama Rao) శత జయంతి (NTR 100th Birth Anniversary Celebrations) ఉత్సవాలలో పాల్గొనడం, ఆ వేదిక మీద చంద్రబాబు మీద పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన చేసిన పాపం అయ్యింది.
చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన రజనీకాంత్ మీద ప్రస్తుతం ఏపీలోని అధికార వైఎస్సాఆర్సీపీ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరూ విమర్శలతో దాడి చేస్తున్నా... తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ ఆయనకు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు. తొలిసారి రజనీకి బాసటగా ఓ గొంతు వినిపించింది. అది జగపతి బాబుది!
రజనీకాంత్ నిజాలే మాట్లాడతారు - జగపతి బాబు
Jagapathi Babu On Rajinikanth : రజనీకాంత్ చక్కగా మాట్లాడతారని, నిజాలే మాట్లాడతారని టాలీవుడ్ సీనియర్ హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు చెప్పారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన గోపీచంద్ 'రామ బాణం' సినిమా ఈ శుక్రవారం (మే 5న) థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ఆయన ముచ్చటించారు. అప్పుడు లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి ప్రస్తావన రాగా...
''రజనీకాంత్ 100% రైట్! అయితే, ఇప్పుడు జరిగినది, లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి నేను వినలేదు. కానీ, ఆయన మాట్లాడే విధానం, తీరు పర్ఫెక్ట్ గా ఉంటుంది'' అని జగపతి బాబు సమాధానం ఇచ్చారు.
Also Read : డివోర్స్ ఫోటోషూట్‌తో వైరల్ అయిన నటికి కొత్త సమస్య? - భర్త ఒక్కడే కాదు, ఇంకా 99!
'కథానాయకుడు' సినిమాలో తొలిసారి రజని, జగపతి బాబు కలిసి నటించారు. ఆ తర్వాత 'లింగా', 'అన్నయ్య' సినిమాల్లో జగపతి బాబు విలన్ రోల్స్ చేశారు. తాజా వివాదం నేపథ్యంలో రజనికి మద్దతు ఇవ్వడంతో జగపతి బాబు మీద వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల రజనీకాంత్ మీద పోసాని కృష్ణమురళి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read : నేను ఆత్మహత్య చేసుకుంటే కారణం వీళ్ళే, నన్ను చంపేందుకూ ప్రయత్నించారు - లిరిసిస్ట్ శ్రేష్ఠ షాకింగ్ పోస్ట్
రజనీకాంత్ మాటలకు విలువ ఏముంది?
Posani Krishna Murali fires on Rajinikanth : ''రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు నాయుడును పొగిడారు. ఎన్టీ రామారావును పొడిగారు. తప్పు ఏమీ లేదు. రజనీ గారు చంద్రబాబును ఎన్నిసార్లు పొడిగినా తప్పు లేదు. మాకు ఇసుమంతైనా నష్టం లేదు. మద్రాసు నుంచి ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ వచ్చి, విజయవాడ సెంటరులో ఆయన మాట్లాడవచ్చు. దాని వల్ల మాకు నష్టం లేదు'' అని పోసాని కృష్ణమురళి తాజాగా వ్యాఖ్యానించారు. తెలుగులో రజనీకాంత్ కంటే చిరంజీవి పెద్ద సూపర్ స్టార్ అని పోసాని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''తెలుగు సినిమాలో సూపర్ స్టార్ మాకు ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ పేరు చిరంజీవి. ఇండియాలోని టాప్ స్టార్లలో ఆయన ఒకరు. తెలుగులో ఏకైక టాప్ స్టార్ చిరంజీవి గారు. ఆయన మాట్లాడితే విలువ ఉంటుంది'' అని పేర్కొన్నారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు వింటారని పోసాని కృష్ణమురళి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వింటారని స్పష్టం చేశారు.