గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమా (NBK 108 Movie) తెరకెక్కిస్తున్నారు. విజయ దశమికి సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయిక. బాలకృష్ణతో ఆమెకు  తొలి చిత్రమిది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అయితే... ఇందులో మరో అందాల భామ తమన్నా కూడా ఉన్నారని ప్రచారం మొదలైంది. 


బాలయ్యతో తమన్నా ఐటమ్ సాంగ్!?
బాలకృష్ణ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ గుసగుస. అంతే కాదు... ఆ సాంగ్ చేయడం కోసం భారీగా డిమాండ్ చేశారని కూడా కొందరు చెవులు కోరుకున్నారు. ఆ నోటా ఈ నోటా అది తమన్నా వరకు చేరింది. దాంతో ఆమె స్పందించారు.


''అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో నటించడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఆయన అంటే గౌరవం. అలాగే, నందమూరి బాలకృష్ణ గారిపై కూడా ఎంతో గౌరవం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలో సాంగ్ గురించి, నా గురించి మీడియాలో నిరాధారమైన వార్తలు వస్తున్నాయి. నన్ను ఎంతో అప్ సెట్ చేశాయి. ఆరోపణలు చేసేటప్పుడు దయచేసి రీసెర్చ్ చేయండి'' అని తమన్నా ట్వీట్ చేశారు. అదీ సంగతి!


Also Read హిందీలో 'మల్లేశం' దర్శకుడు తీసిన '8 ఎఎం మెట్రో' సినిమా రివ్యూ... మంచి ఫిల్టర్ కాఫీ తాగిన అనుభూతి






బాలయ్యకు విలన్... అర్జున్ రాంపాల్!
బాలకృష్ణ సినిమాలో అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు ''జాతీయ పురస్కార గ్రహీత, ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అర్జున్ రాంపాల్ గారికి వెల్కమ్! తెలుగులో ఆయనకు తొలి చిత్రమిది'' అని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ సినిమా సంస్థ కొన్ని రోజుల క్రితం ఓ వీడియో విడుదల చేశారు. 


బాలయ్య డైలాగ్ అర్జున్ రాంపాల్ చెబితే?
'ఫ్లూట్ జింక ముందు ఊదు! సింహం ముందు కాదు' - నట సింహం చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్! ఇప్పుడు దీనిని అర్జున్ రాంపాల్ చెప్పారు. అంతే కాదు, అనిల్ రావిపూడి సినిమాలో మంచి మంచి డైలాగులు ఉన్నాయని ఆయన వివరించారు. సినిమాలో అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థాంక్స్ అంటూ నమస్కారం పెట్టారు. ఇప్పుడు బాలకృష్ణ, అర్జున్ రాంపాల్ మీద సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. 


రూ. 36 కోట్లకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్!?
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie) సినిమా విజయదశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఆరు నెలల ముందు సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్మేశారని సమాచారం. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 36 కోట్లకు ఆల్ లాంగ్వేజెస్ రైట్స్ తీసుకుందట.


దసరా బరిలో బాలకృష్ణ సినిమా!
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ సోదరుడిగా శరత్ కుమార్, ఆయన కుమార్తెగా శ్రీ లీల కనిపించనున్నారు. 


Also Read ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ - మార్చిలో NTR 31 షురూ, ట్విస్ట్ ఏంటంటే?