హాలీవుడ్ దర్శకుడు రాబ్ మార్షల్ తెరకెక్కించిన చిత్రం ‘ది లిటిల్ మెర్మైడ్’ ప్రమోషన్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాల్గొంది. త్వరలో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో తాజాగా ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించి ఆకట్టుకుంది.   ఈ చిత్రంలో  ఏరియల్‌గా హాలీ బెయిలీ, ఉర్సులాగా మెలిస్సా మెక్‌కార్తీ, ప్రిన్స్ ఎరిక్‌గా జోనా హౌర్-కింగ్, కింగ్ ట్రిటాన్‌గా జేవియర్ బార్డెమ్, సెబాస్టియన్‌గా డేవిడ్ డిగ్స్, ఫ్లౌండర్, ఆక్వావెజ్ని, నోమాగా జాకబ్ ట్రెంబ్లే నటించారు. డిస్నీ ఇండియా ‘ది లిటిల్ మెర్మైడ్‌’ను మే 26న ఇంగ్లీష్ లో విడుదల చేయనుంది.


ప్రిన్సెస్ ఏరియల్‌గా జాన్వీ కపూర్


తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ప్రిన్సెస్ ఏరియల్‌గా జాన్వీ సినీ అభిమానులను మెస్మరైజ్ చేసింది. తన అందంతో ఆకట్టుకుంది. మత్స్యకన్యగా ఆశ్చర్యపరిచింది. జాన్వీ కపూర్ ప్రిన్సెస్ ఏరియల్ పాత్రలో ఇద్దరు చిన్నారులకు 'మచ్లీ జల్ కీ రాణి హై హై' అనే పోయెం చెప్తూ కనిపించింది. పోయెం చెప్తూనే మత్స్యకన్యగా మారుతూ చిన్నారులను ఆశ్చర్యపరుస్తుంది. “బహర్ నికలో తో క్యా” అనే చిన్నారుల ప్రశ్నకు, జాన్వి తనని తాను ప్రిన్సెస్ ఏరియల్‌గా మార్చుకుని,  “ప్రిన్సెస్ ఏరియల్ బ్యాన్ జాయేగీ" అని చెప్తుంది. ఈ   చిత్రం త్వరలోనే గ్లోబల్ గా విడుదల కానుంది.


Also Read : తెలుగులో లేటెస్ట్ మలయాళ బ్లాక్‌బస్టర్ '2018' - ఏపీ, తెలంగాణలోని థియేటర్లలో ఆ రోజే విడుదల






ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న జాన్వీ


ఇక జాన్వీ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ అనే సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో జాన్వీ లుక్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ లో జాన్వీ కపూర్ అచ్చమయిన తెలుగు అమ్మాయిలా కనిపిస్తోంది. అయితే, ఈ సినిమా సముద్రం నేపథ్యంలో ఉంటోంది కాబట్టి, జాన్వీ కపూర్ పోస్టర్ వెనక సముద్రాన్ని చూపించినట్లు తెలుస్తోంది.  అందాల తార శ్రీదేవీ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఆమె ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. ఇదే జాన్వీకి మొదటి సినిమా. శ్రీదేవికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది తెలుగు ఇండస్ట్రీ. టాలీవుడ్ లో శ్రీదేవి పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి హీరోయిన్ కూతురిగా జాన్వీ తెలుగలో సినిమా చేయడం విశేషం. అందులోనూ తనకు ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని గతంలో కూడా చెప్పింది జాన్వీ. ఎన్టీఆర్ తో సినిమా చేయడం డ్రీమ్ రోల్ అని తెలిపింది. ఇక తన తొలి తెలుగు సినిమాకు గాను ఏకంగా రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాద్ ఆమె బస చేసేందుకు చిత్ర బృందంమే ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.  ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ తో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.


Read Also: లక్షన్నరతో పెళ్లి చేసుకున్న మహేష్ బాబు 'అతిథి' హీరోయిన్ - ఆ చీర 3 వేలే!