పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలో గుర్తుండిపోయేలా పెళ్లి వేడుక జరుపుకుంటారు. ఇక సెలబ్రిటీల పెళ్లిళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్ద పెద్ద పేరు మోసిన కోటల్లో, కోట్ల రూపాయలు ఖర్చు చేసి వివాహం వేడుకలు జరుపుకుంటారు. ఎంత ఘనంగా పెళ్లి చేసుకుంటే అంత గొప్పగా ఫీలవుతారు. కానీ, అందుకు తాము మినహాయింపు అంటుంది బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు. 2006లో ఆర్జే అన్ మోల్ ను పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా 9 ఏండ్ల వివాహ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా తన పెళ్లికి సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించింది.

   






తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు


అమృతా రావు వాస్తవానికి చాలా తక్కువ సినిమాలే చేసింది. అయినా, తన అద్భుత నటనతో ఆకట్టుకుంది. ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. 2002లో నటనా రంగంలోకి అడుగు పెట్టిన అమృతా,  ‘అబ్‌ కే బరాస్‌’ అనే మూవీలో నటించింది. ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌ తో కలిసి ‘ఇష్క్‌ విష్క్‌’  అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత సాహిద్‌ తో ‘వివాహ్‌’ అనే సినిమా చేసింది. ఈ మూవీతో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మ సందడి చేసింది. మహేష్ బాబుతో కలిసి ‘అథితి’ సినిమాలో నటించింది.   


పెళ్లి ఖర్చు కేవలం రూ. 1.5 లక్షలు


కెరీర్‌ పీక్ స్టేజిలో ఉండగానే ఆర్జే అన్ మోల్ ను అమృత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. తాజాగా తన పెళ్లి గురించి పలు కీలక విషయాలు వెల్లడించింది అమృత. పుణెలోని ఇస్కాన్‌ టెంపులో తమ వివాహం జరిగినట్లు వివరించింది.  కేవలం దగ్గరి బంధువులు, కొద్ది మంది మిత్రుల సమక్షంలో తమ పెళ్లి జరిగిందని చెప్పింది. పెళ్లి కోసం కేవలం రూ.1.5లక్షల మాత్రమే ఖర్చు పెట్టినట్లు వివరించింది. పెళ్లి బట్టలు, కల్యాణ వేదిక, ప్రయాణ ఖర్చులు కూడా ఈ డబ్బుతోనే సరిపెట్టినట్లు చెప్పింది. పెళ్లి సందర్భంగా భార్యాభర్తలిద్దరం డిజైనర్‌ దుస్తులు కాకుండా, కేవలం సంప్రదాయ దుస్తులు ధరించినట్లు చెప్పింది. ఇందుకోసం కేవలం రూ. 30 వేలు ఖర్చు చేసినట్లు వివరించింది. పెళ్లి వేదిక కోసం రూ. 11 వేల చెల్లించినట్లు వివరించింది. మొత్తంగా తమ పెళ్లి ఖర్చు లక్షన్నరకు మించలేదని చెప్పింది. పెళ్లి అనేది ప్రేమతో కూడి ఉండాలి కానీ, డబ్బు, హంగూ ఆర్భాటాలతో కాదని చెప్పింది అమృత. పెళ్లికి దగ్గరి బంధువులు, కొందరు స్నేహితులను మాత్రమే ఆహ్వానించామని అమృత వివరించింది.


Also Read ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?    






అన్ మోల్ – అమృతరావు 2006లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ అబ్బాయి జన్మించాడు.  పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా నెట్టింట్లో యాక్టివ్ గా ఉంటుంది అమృత. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.


Read Also: బోరున విలపిస్తున్న రైజా విల్సన్, అభిమానులు షాక్? ఇంతకీ ఆమెకు ఏమైనట్లు?