రైజా విల్సన్. మోడల్ గా రాణించి, బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చక్కటి ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. పలు సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తోంది.
రైజా విల్సన్ కంటతడి, అభిమానుల షాక్
తాజాగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఫోటోలు అభిమానులను షాక్ కు గురి చేశాయి. కన్నీళ్లతో బాధపడుతున్న ఫోటోలను షేర్ చేసింది. ముఖం మొత్తం బాధతో నిడిపోయింది. నా కన్నీళ్లకు నిర్దిష్ట కారణాన్ని చెప్పలేను అంటూ ఈ ఫోటోలకు ఆమె క్యాప్షన్ పెట్టింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో తెలియక అభిమానులు ఆరా తీసే ప్రయత్నం చేశారు. జివి ప్రకాష్ కుమార్, మంజిమా మోహన్, ఫరీనా ఆజాద్, మాధురి లాంటి సినీ స్టార్స్ ఆమెను ఓదార్చారు. ఆమె అభిమానులు సైతం త్వరగా సమస్య నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. అయితే, ఆమె దు:ఖానికి కారణం ఏంటనేది మాత్రం కచ్చితంగా బయటకు తెలియలేదు.
Also Read : యుద్ధభూమిలో కలుద్దాం మిత్రమా - ఎన్టీఆర్‌తో 'వార్ 2', హింట్ ఇచ్చేసిన హృతిక్!
మోడలింగ్ నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టిన రైజా విల్సన్
రైజా విల్సన్ 10 ఏప్రిల్ 1989లో తమిళనాడులోని ఊటీలో జన్మించింది. కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. HICC ఫెమినా మిస్ సౌత్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును ఆమె గెలుచుకుంది. 2017లో త కమల్ హాసన్ షో హోస్ట్ చేసిన తమిళ రియాలిటీ టీవీ బిగ్ బాస్- సీజన్ 1లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. చక్కటి ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ‘అర్జున్ రెడ్డి‘ తమిళ రీమేక్ ‘ప్యార్ ప్రేమ కాదల్‘ నటించింది. ఈ సినిమాలో సింధూజ పాత్రకు గాను సౌత్‌లో ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది . ఆమె విజయం తర్వాత ఆమె ‘ధనుసు రాసి నేయర్‌గాలే‘ (2019), ‘వర్మ‘(2020), ‘ఎఫ్‌ఐఆర్‘ (2022), ‘పొయిక్కల్ కుతిరై‘ (2022), ‘కాఫీ విత్ కాదల్‘ (2022) సహా పలు చిత్రాలలో నటించింది.
ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న రైజా విల్సన్
ప్రస్తుతం రైజా విల్సన్ పలు సినిమాల్లో నటిస్తోంది. ఈమె రీసెంట్ గా నటించిన 'కరుంగప్పియం' చిత్రంలో త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. అంతేకాదు, పలు సినిమాలకు సంతకాలు చేసింది. 'లవ్', 'ది చేజ్', 'ఆలిస్' 'కాదలిక్క యారుమిల్లై' అనే సినిమాల్లో షూటింగ్ దశలో ఉన్నాయి. ఆమె మరికొన్ని కథలను కూడా వింటున్నది.
Read Also: 'సింహాద్రి' రీ రిలీజ్ - 1210 షోలతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డు