NTR Centenary Celebrations : విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య కథానాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, శకపురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్‌, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో గల కైతలాపూర్‌ మైదానంలో 'ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ' అత్యంత ప్రతిష్టాత్మకంగా వేడులకలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీ రామారావు మనవడు, దివంగత హరికృష్ణ తనయుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)ను ఆహ్వానించారు. అయితే... ఆయన వేడుకలకు రావడం లేదు. ఎందుకు అంటే?


యంగ్ టైగర్ పుట్టినరోజు కావడంతో...
ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (Jr NTR Birthday). ఈ రోజే హైదరాబాదులో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. రెండూ ఒకే రోజు కావడంతో... ఫ్యామిలీతో కలిసి ముందుగా కొన్ని ప్లాన్స్ చేసుకోవడం వల్ల శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఉత్సవ నిర్వాహకులు ఆహ్వానం ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఆ విషయం చెప్పారని వివరించారు. అదీ సంగతి!


ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు అవుతున్నారు. ఎన్టీఆర్ తనయుడు, గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇంకా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, బీజేపీ జాతీయ నేత పురందేశ్వరి, టిటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, కన్నడ చిత్రసీమ నుంచి హీరో శివకుమార్‌ హాజరుకానున్నారు.


'దేవర'గా ఎన్టీఆర్ వచ్చేశారు
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు వస్తే... ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా 'దేవర' ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టైటిల్ కూడా నిన్నే ప్రకటించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రమిది.


Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?






Devara First Look Review : చేతిలో కత్తి, ఒంటి నిండా రక్తంతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్‌ను చూడవచ్చు. ఆర్ఆర్ఆర్ కంటే కొంచెం పొడవైన జుట్టుతో ఎన్టీఆర్ ఇందులో కనిపించనున్నారు. వెనుక పడవలో శవాల గుట్టను చూస్తే వయొలెంట్ యాక్షన్ సినిమాగా ‘దేవర’ తెరకెక్కనుందని తెలుస్తోంది.   మొత్తంగా ఈ మాస్‌ ఫస్ట్‌లుక్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.


ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. బాలీవుడ్ స్టార్, కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ ప్రధాన ప్రతినాయకుడి పాత్ర చేస్తున్నారు. ఆయనకూ తెలుగులో ఇదే మొదటి సినిమా. సైఫ్ జోడిగా, ఆయన భార్య పాత్రలో టీవీ నటి చైత్ర రాయ్ నటిస్తున్నారు. 


Also Read తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?