మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ (Jr NTR) ఎన్టీఆర్ హిందీలో ఓ భారీ యాక్షన్ సినిమా చేయడానికి 'ఎస్' చెప్పారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్, యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ ఫిల్మ్ 'వార్' సీక్వెల్ 'వార్ 2' (War 2 Movie)లో ఎన్టీఆర్ నటించనున్నారు. ఇంకా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. కానీ, హృతిక్ హింట్ ఇచ్చేశారు. 


పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా!
ఇవాళ ఎన్టీఆర్ పుట్టినరోజు (NTR Birthday). ఈ సందర్భంగా హృతిక్ రోషన్ విషెస్ చెప్పారు. అందులో 'వార్' గురించి హింట్ కూడా ఇచ్చేశారు. 


''హ్యాపీ బర్త్ డే తారక్! యాక్షన్ ప్యాక్డ్ ఇయర్ ముందు ఉంది. మనం యుద్ధభూమిలో కలుద్దాం మిత్రమా! మనం కలిసే వరకు సంతోషంగా, శాంతిగా ఉండు. పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా'' అని హృతిక్ రోషన్ ట్వీట్ చేశారు. ఇంకా ఎన్టీఆర్ రిప్లై ఇవ్వలేదు.


Also Read ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?    






హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్!?
'వార్'లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. అయితే, ఆ సినిమాకు సీక్వెల్ ఉంటుందని యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో ప్రకటించింది. అందులో ఎన్టీఆర్ నటిస్తున్నారు. 


Also Read ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?


'వార్ 2'లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య సన్నివేశాలు 'నువ్వా నేనా' అన్నట్టు ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యశ్ రాజ్ ఫిల్మ్స్ సన్నిహిత వర్గాలు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ''అవును, 'వార్ 2'లో నటించేందుకు ఎన్టీఆర్ అంగీకరించారు. ఇది నిజమైన పాన్ ఇండియా ఫిల్మ్'' అని తెలిపాయి. 


అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో...  
'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక - నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథ అందించారట. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాకు దక్షిణాది భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అథితిగా అటెండ్ అయ్యారు. అప్పుడు 'వార్ 2' గురించి డిస్కషన్ జరిగినట్టు సమాచారం. 



'వార్ 2' - ఎన్టీఆర్ 311
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తున్నారు. హీరోగా ఆయన 30వ చిత్రమిది. దీని తర్వాత 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ప్రభాస్ హీరోగా నీల్ చేస్తున్న 'సలార్' కంప్లీట్ అయ్యాక... ఎన్టీఆర్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే... దాని కంటే ముందు 'వార్ 2' షూటింగ్ స్టార్ట్ చేయాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఏడాది ఆఖరిలో 'వార్ 2'ను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని హృతిక్ రోషన్, ఎన్టీఆర్ & యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా భావిస్తున్నారట.