‘RRR’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు పెంచారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పటికే కొరటాల శిద దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ ఈ చిత్రంపై ఓ రేంజిలో అంచనాలను పెంచేశాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది.
మార్చి 2024 నుంచి ‘NTR31’ షూటింగ్
ఇక పాన్ ఇండియన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ తెరకెక్కనుంది. యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 2024లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈమేరకు ఎన్టీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తూ ఈ ప్రకటన చేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. గత ఏడాది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన పోస్టర్ ను వదిలారు. అది ఏ రేంజ్ లో ఉందో మాటల్లో చెప్పలేం. చాలా క్రూరంగా కనిపిస్తున్నారు ఎన్టీఆర్. ఈ పోస్టర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. పోస్టరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read : ఎన్టీఆర్ కాకుండా మరో హీరో అయితే 'టెంపర్' క్లైమాక్స్, 'కొమురం భీముడో' సాంగ్ చేసేవారా?
ఈ ఏడాది చివరలో సెట్స్ మీదకు ‘వార్ 2’
ఇక బాలీవుడ్ లోనూ సత్తా చాటబోతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘వార్ 2’లో నటించనున్నారు. ‘వార్ 2’ గురించి ఇప్పటికే యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటన చేసింది. స్పై యూనివర్స్ చిత్రంలోకి జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో హీరోగా హృతిక్ రోషన్ నటిస్తుండగా, నెగెటివ్ రోల్ లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సినిమా షూటింగ్ ప్రారంభం ముహూర్తం సైతం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించాలని ఫిల్మ్ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : నూనూగు మీసాల వయసులోనే ఇండస్ట్రీ హిట్లు, ఎన్నో ఆటు పోట్లు - ఎన్టీఆర్ సినీ జర్నీ సాగిందిలా!
'వార్' సినిమాలో లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సినిమాలో ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. ఇద్దరూ పోటా పోటీగా నటించారు. చివరకు, టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ మరణించినట్టు చూపించారు. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. 'వార్' సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. అయితే, 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.