Tamannaah Bhatia : నటి తమన్నా భాటియా ఇటీవల దక్షిణ భారత సూపర్‌స్టార్‌లతో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంది. సెట్‌లో మహిళల పట్ల వారి చూపించే శ్రద్ధపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిలోని నటీనటులు బాగా ఎదిగారని, ఎవరు ఎంతో గౌరవప్రదంగా ఉంటారంటూ పలు కామెంట్స్ చేసింది. భవిష్యత్తులో తాను స్టార్ అవుతాననే నమ్మకాన్ని ఒకప్పుడు చిరంజీవి ఎలా వ్యక్తం చేశారో తమన్నా ప్రస్తావించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కెరీర్ ప్రారంభంలో ఆమెపై చూపిన అభిమానాన్ని, ప్రేమను కూడా వివరించింది.
"నువ్వు స్టార్ అవుతావు అని నాతో చెప్పిన మొదటి వ్యక్తులలో చిరంజీవి ఒకరు. అప్పటికి నేను రామ్ చరణ్‌తో కలిసి నటించలేదు. నేను చరణ్, (నాగ) చైతన్యలను చూశాను. నాగార్జున తన కొడుకుని కూడా బాగా పెంచారు. సౌత్ ఇండస్ట్రీలోని హీరోలు తమ అబ్బాయిలను చాలా అందంగా పెంచినట్లు నాకు అనిపిస్తుంది. వారు చాలా మంచి ప్రవర్తనను కలిగి ఉంటారు. చాలా సంస్కారవంతులు, చాలా గౌరవప్రదంగా ఉంటారు. నా ఉద్దేశ్యం ప్రకారం అలాంటి ధైర్య సాహసాలున్న హీరోలుండడం ప్రపంచంలోనే చాలా అరుదు. మన దేశంలో కూడా అలాంటి వారు చాలా తక్కువగానే ఉంటారు. కానీ నేను పనిచేసిన కొంతమంది నటులను చూస్కుంటే... వారు చాలా ధైర్యంగా ఉన్నారు. సెట్‌లో ఉన్న మహిళలు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకుంటారు. అందులో చిరంజీవి కూడా ఒకరు" అని తమన్నా తెలిపారు.
రజనీకాంత్ తనను ఏ విధంగా ఆశ్చర్యపరిచారన్న విషయాన్ని కూడా తమన్నా పంచుకున్నారు. తనతో ఒకరోజు పనిచేసిన తర్వాత ఆయన తన కోసం ఓ పుస్తకం కొని తీసుకువచ్చారని తమన్నా చెప్పారు. “రజనీ నిజంగా నన్ను ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే నేను అతనితో ఒక రోజే కలిసి పనిచేశాను. అయినా కూడా ఆయన నా గురించి ఆలోచించి నాకు ఒక పుస్తకం కొన్నారు. ఇంతకు ముందు ఎవరూ అలా చేయలేదు. నిజంగా ఆయన సూపర్‌స్టార్ అని నిరూపించుకున్నారు. ఆయన అందరి లాంటి సూపర్‌స్టార్ కాదు. ఎందుకంటే ఆయన నిజంగా మనుషులను మనుషుల్లానే చూస్తారు" అని తమన్నా చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తమన్నా 'జైలర్'లో నటించనున్నారు. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'భోలా శంకర్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలోనూ చిరంజీవి సరసన తమన్నా ఆమె కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆగస్టు11న విడుదలవ్వడానికి రెడీ అవుతోంది.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోన్న తమన్నా.. ఇటీవల రిలీజైన 'లస్ట్ స్టోరీస్ 2'లో నటించింది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో ఆమె ఓ బోల్డ్ పాత్రలో కనిపించింది. అందులో భాగంగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ఇక మరోవైపు తమన్నా ఇప్పటివరకు ఆన్ స్క్రీన్‌పై ఎవరికీ ముద్దు ఇవ్వలేదని.. లస్ట్ స్టోరీస్ కోసం మాత్రం తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సన్నివేశంలో నటించానని చెప్పుకొచ్చింది. కాగా ఈ జంట అతి త్వరలోనే పెళ్లి బంధంతో ఒకటికానున్నారని సమాచారం.
Read Also : Salar Release Date: 'సలార్' మూవీ బిగ్ అప్డేట్ - టీజర్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial