'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'... మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా కోసం ఇండియాలో, విదేశాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, టైగర్ మధ్య సన్నివేశం ఒకటి. ఆ సీన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ముఖం ముందు పులి గాండ్రించినప్పుడు... ఎన్టీఆర్ గర్జించడం అందర్నీ ఆకర్షించింది. అయితే... గర్జనకు ముందు ఎన్టీఆర్ కళ్ళల్లో చిన్నపాటి భయం కూడా ఉంది. ఆ భయం గురించి రాజమౌళిని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించారు.


'పులి ముఖం మీదకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ లో ఒక వణుకు కనిపించింది. అది భయం కాదు. దాని గురించి మీరేం చెబుతారు?' అని సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించగా... "నేను ఆ సన్నివేశం గురించి తారక్ (ఎన్టీఆర్) కు చెప్పినప్పుడు భయం ఉండాలని చెప్పాను. భయం అంటే పిరికివాడి భయం కాదు! 'ఇప్పుడు మనం ఒక పని మీద వెళ్తున్నాం. ఆ పని జరుగుతుందో? లేదో? అనే టెన్షన్ ఉంటుంది కదా! జరగాల్సిన పని చాలా చాలా ముఖ్యం కాబట్టి... ఆ టెన్షన్ కావాలి' అని చెప్పాను. పులిని చూసి కాకుండా పని జరుగుతుందో? లేదో? అనే భయం ఉండాలని చెప్పాను. టెర్రిఫిక్ యాక్టర్ కదా! అద్భుతంగా చేశారు. తనకు మరీ వివరించి చెప్పను. ఓవరాల్ గా ఏం కావాలో, అక్కడ ఏం జరుగుతుందో చెబుతాను. ఎన్టీఆర్ నాకు కావాల్సింది డెలివరీ చేస్తారు" అని రాజమౌళి చెప్పారు.


ఎన్టీఆర్ మెమరీ పవర్ గురించి కూడా రాజమౌళి చెప్పుకొచ్చారు. "కథ ఫస్ట్ టైమ్ చెప్పినప్పటికీ... ఏడాది తర్వాత చెప్పేటప్పటికీ చిన్న చిన్న మార్పులు వస్తాయి. ఎన్టీఆర్ కు ప్రతీదీ గుర్తు ఉంటుంది. మనం ఒరిజినల్ మర్చిపోతాం. కానీ, తారక్ మర్చిపోడు. 'మీరు బిగినింగ్ లో అది చెప్పారు కదా!' అంటాడు" అని రాజమౌళి తెలిపారు. పులి ముఖం మీదకు వచ్చినప్పుడు భయపడిన తర్వాత... ఎన్టీఆర్ గర్జన కూడా తనకు బాగా నచ్చిందని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. 


Also Read : 'భీమ్లా నాయక్'లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నడిపిన బండి కావాలా? అయితే ఇలా చేయండి!


Also Read: అక్కినేని నాగ చైతన్యకు మరో హిట్ గ్యారెంటీ! శింబు సినిమా రీమేక్ కన్ఫర్మ్ చేసిన డైరెక్టర్