RamaRao On Duty Movie Update: మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. ఈ సినిమాతో శరత్ మండవ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జూన్ 17న (RamaRao On Duty Movie Latest Release Date) ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నేడు వెల్లడించారు. 'రామారావు ఆన్ డ్యూటీ'లో ప్రభుత్వ ఉద్యోగి రామారావు పాత్రలో రవితేజ కనిపించనున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... ఇసుక మాఫియా మీద పోరాటం చేసే అధికారిగా కనిపించారు. ఇంకేం చేశారనేది సినిమాలో చూడాలి.
తొలుత మార్చి 25న 'రామారావు ఆన్ డ్యూటీ'ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే... ఆ రోజు 'ఆర్ఆర్ఆర్' ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో వాయిదా వేయక తప్పలేదు. "బాక్సాఫీస్ హంట్ కోసం ఆర్డర్ జారీ చేయడం జరిగింది. జూన్ 17న థియేటర్లలో 'రామారావు ఆన్ డ్యూటీ' భారీ ఎత్తున విడుదల కానుంది" అని ఎస్ఎల్‌వీ సినిమాస్ సంస్థ తెలియజేసింది.
Also Read: 'బాహుబలి'కి బాబులా 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' ప్రీ రిలీజ్ బిజినెస్!
యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'రామారావు ఆన్ డ్యూటీ' తెరకెక్కుతోంది. ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, సంగీతం: సామ్ సీఎస్.