RRR Movie Latest Updates and News: 'ఆర్ఆర్ఆర్' బడ్జెట్ ఎంత? హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి, ప్రధాన తారాగణం - సాంకేతిక వర్గం తీసుకునే రెమ్యూనరేషన్స్ కాకుండా రూ. 336 కోట్లు అయ్యింది. ఇదేదో కాకి లెక్క కాదు, సినిమా యూనిట్ స్వయంగా ఏపీ ప్రభుత్వానికి సమర్పించిన మేకింగ్ కాస్ట్ లెక్క! అది పక్కన పెట్టి... పారితోషికాలతో చూసుకున్నా సుమారు 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ అయ్యిందని టాక్. ఆఫ్ కోర్స్... రాజమౌళి బ్రాండ్ వేల్యూకి తోడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ తోడు కావడంతో డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో మేకింగ్ కాస్ట్ వచ్చేసింది. థియేట్రికల్ బిజినెస్ నిర్మాత డీవీవీ దానయ్యకు బోనస్. అందులోంచి రెమ్యూనరేషన్స్ తీసేసినా... లాభాలు గ్యారెంటీ. టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల ప్రకారం 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'ను తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు అమ్మారు? ఏంటి? అనే లెక్కలు ఒక్కసారి చూస్తే...

ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం రూ. 75 కోట్లు
సీడెడ్  రూ. 45 కోట్లు 
ఉత్తరాంధ్ర రూ. 23 కోట్లు 
తూర్పు గోదావరి రూ. 15 కోట్లు 
పశ్చిమ గోదావరి  రూ. 13 కోట్లు 
గుంటూరు రూ. 17 కోట్లు
కృష్ణా జిల్లా రూ. 14 కోట్లు 
నెల్లూరు రూ. 9 కోట్లు 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్' సినిమా 211 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం అంటే మామూలు విషయం కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

'ఆర్ఆర్ఆర్' డిజిటల్, శాటిలైట్, హిందీ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 475 కోట్లకు బాలీవుడ్ ప్రొడ్యూసర్ జయంతి లాల్ గడా తీసుకున్నారట. థియేట్రికల్ మినహా మిగతా రైట్స్ రూ. 335 కోట్లకు అమ్మేశారు. 'ఆర్ఆర్ఆర్' ఓవర్సీస్ రైట్స్ కూడా రూ. 100 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 900 కోట్లు దాటిందని ట్రేడ్ పండితుల అంచనా. 

Also Read: 'ఆర్ఆర్ఆర్' చూశా, 3 వేల కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ - కలరిస్ట్ నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

సీడెడ్ ఏరియాలో 'బాహుబలి 2' టోటల్ షేర్ రూ. 34.80 కోట్లు. అంతకు మించి 'ఆర్ఆర్ఆర్' కలెక్ట్ చేయాలి. లేదంటే డిస్ట్రిబ్యూటర్‌కు లాస్ తప్పదు. ప్రస్తుతం సినిమాపై నెలకొన్న క్రేజ్, హైప్ చూస్తే అంత కలెక్ట్ చేయడం కష్టం కాదని అనిపిస్తోంది. బెనిఫిట్ షోస్ కలెక్షన్స్ కూడా యాడ్ చేసుకుంటే నైజాంలో తొలి రోజు పాతిక కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవచ్చని ఒక అంచనా. 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ బిజినెస్, ఫస్ట్ కలెక్షన్స్ అంచనాలు చూస్తుంటే... 'బాహుబలి'కి బాబులా ఉందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు. 'బాహుబలి' ఫస్ట్ పార్ట్ థియేట్రికల్ కలెక్షన్స్ రూ . 418 కోట్లు కాగా... సెకండ్ పార్ట్ కలెక్షన్స్ రూ. 1031 కోట్లు.

Also Read: 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో ఆ సీన్ డిలీట్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే!