'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' మేనియా మొదలైంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిభపై ఎవరికీ సందేహాలు లేవు. సినిమా సాధించబోయే విజయం మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇరగదీశారని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. అయితే... ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇక్కడ డిస్కషన్.


'ఆర్ఆర్ఆర్' సినిమాకు కలరిస్ట్‌గా పని చేసిన శివకుమార్ బీవీఆర్ అయితే... మూడు వేల కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేస్తుందని చెబుతున్నారు. రీసెంట్‌గా ఆయన సినిమా చూశారట. "ఇప్పుడే 'ఆర్ఆర్ఆర్' చూశా. కలరిస్ట్‌గా ఒక్కో ఫ్రేమ్ వెయ్యిసార్లు చూసినా... సాధారణ ప్రేక్షకుడిగా లాస్ట్ కాపీ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. 'ఆర్ఆర్ఆర్' అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందని బలంగా చెప్తున్నాను. ఎవరూ బ్రేక్ చేయలేని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. రాసుకోండి... మూడు వేల కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది" అని శివకుమార్ బీవీఆర్ ట్వీట్ చేశారు.






మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' విడుదల కానున్న సంగతి తెలిసిందే. అమెరికాలో 24న షోస్ పడుతున్నాయి. ఆల్రెడీ 1500 లొకేషన్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అక్కడ ఆల్రెడీ రెండు మిలియన్ డాలర్స్ పైగా వసూలు చేసి, మూడు మిలియన్ డాలర్స్ దిశగా దూసుకు వెళుతోంది. ఇండియాలో కూడా 24న పెయిడ్ ప్రీమియర్లు వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పరంగా 'ఆర్ఆర్ఆర్' సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం కన్ఫర్మ్ అని చెప్పవచ్చు.


Also Read: 'ఆర్ఆర్ఆర్'కు నష్టం రాకుండా, ప్రేక్షకులపై భారం పడకుండా! - రాజమౌళికి ఏపీ సీయం జగన్ హామీ


తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ... ఇండియాలో ఐదు భాషల్లో సినిమా విడుదల అవుతోంది. దేశవ్యాప్తంగా సుమారు మూడు వేలకు పైగా థియేటర్లలో సినిమా విడుదల కానుందని ఒక అంచనా.  సినిమాకు రూ. 550 కోట్లు బడ్జెట్ అయ్యిందని, 860 కోట్ల బిజినెస్ చేసిందని ఫిల్మ్ నగర్ టాక్. 


Also Read: ఉక్రెయిన్‌లో సెక్యూరిటీకి ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన రామ్ చరణ్