Shanmukh Jaswanth latest updates, news: షణ్ముఖ్ జస్వంత్ అభిమానులకు ఇదొక స్వీట్ న్యూస్. షన్ను క్రేజ్ గురించి చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్‌. షణ్ముఖ్ అంటే చాలా మంది యూట్యూబర్ అనుకుంటారు. యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్‌లు, సాంగ్స్ ద్వారా అతడిని మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత 'బిగ్ బాస్'కు వెళ్ళాడు. అక్కడ కొంత నెగెటివిటీ వచ్చింది. కానీ, అతను తట్టుకుని నిలబడ్డాడు.


లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... త్వరలో షణ్ముఖ్ జస్వంత్ ఒక వీడియో సాంగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో అతడితో పాటు హీరోయిన్ నువేక్ష డ్యాన్స్ చేయనున్నారని సమాచారం. 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాలో నటించిన అమ్మాయే ఈ అమ్మాయి. ఆ తర్వాత 'అతిథిదేవో భవ', 'సెబాస్టియన్ పీసీ' సినిమాలు చేశారు.


Also Read: సముద్రంలో మెగా స్క్రీన్‌పై ‘భోళాశంకర్’, జుహూ బీచ్‌‌లో చిరు అభిమానులకు సర్‌ప్రైజ్


ఆల్రెడీ విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుతు...' పాటకు షణ్ముఖ్ జస్వంత్, నువేక్ష డ్యాన్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియోకి ఆల్రెడీ వన్ మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. స్పెషల్ మ్యూజిక్ వీడియో కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో 'అరబిక్ కుతు...'కు డ్యాన్స్ చేశారని టాక్. సాంగ్ షూట్ కూడా కంప్లీట్ చేశారట. 


Also Read: పాపం SRK - ఓటీటీ రంగంలోకి షారుక్ ఖాన్, బాద్‌షా ఆశలను గల్లంతు చేసిన డిస్నీ హాట్ స్టార్!