'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో 'నాటు నాటు...' (naatu naatu song) సాంగ్ ఉంది కదా! ఆ పాటను ఉక్రెయిన్‌లో షూట్ చేశారు. అందులో బ్యాక్‌గ్యౌండ్ డ్యాన్స‌ర్లు ఉక్రెయిన్ వాసులే. 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేసినప్పుడు అక్కడ పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా ఆ దేశ ప్రజలు యుద్ధంలో పాల్గొంటున్నారు. రష్యాకు వ్యతిరేకంగా మాతృదేశానికి అండగా నిలబడుతున్నారు. అక్కడ షూటింగ్ చేసినప్పుడు ప్రస్తుత పరిస్థితిని 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఊహించిందా? అక్కడ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో కాంటాక్ట్‌లో ఉన్నారా? తదితర ప్రశ్నలకు నేడు మీడియాతో సమావేశమైన ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి స్పందించారు.


ఉక్రెయిన్‌లో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సహాయం (ram charan financial help to ukraine security) చేశానని రామ్ చరణ్ తెలిపారు. "మేం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేసేటప్పుడు ఉక్రెయిన్‌లో ఆందోళన వాతావరణం ఏమీ ఫీలవ్వలేదు. యుద్ధం మొదలైన తర్వాత 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ టైమ్‌లో... అక్కడ నాకు సెక్యూటిరీగా ఉన్న వ్యక్తితో మాట్లాడాను. ఆయన తండ్రి, 80 ఏళ్ళ వ్యక్తి గన్ పట్టుకుని యుద్ధంలో పాల్గొంటున్నారు. వాళ్ళకు కొంత డబ్బులు పంపించాను. ఆ సహాయం సరిపోదు. అయితే, నా వంతు సహాయం చేశా" అని రామ్ చరణ్ (ram charan) చెప్పారు.


ఉక్రెయిన్‌లో ప్రజలకు, ముఖ్యంగా డ్యాన్సర్లకు కొత్త విషయం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉందని ఎన్టీఆర్ (NTR - RRR Press Meet) చెప్పుకొచ్చారు. "ఉక్రెయిన్ ప్రజలు చాలా ఫ్రెండ్లీ. ప్రొఫెషనల్. అక్కడి డ్యాన్సర్ల గురించి చెప్పాలి. 'నాటు నాటు...' సాంగ్ చూశారు కదా! వాళ్ళు ఎంత బాగా చేశారో... సాంగ్‌లో డ్యాన్స్ స్టైల్ వాళ్ళ డ్యాన్స్ స్టైల్ కాదు. కానీ, వాళ్ళు చాలా ఫాస్ట్‌గా నేర్చుకున్నారు. వాళ్ళకు కొత్తది నేర్చుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది" అని ఎన్టీఆర్ (NTR shares his working experiance with ukraine dancers) అన్నారు.
Also Read: 'నరాలు బిగుసుకుపోయే సీన్' ఎగ్జైట్మెంట్ పెంచేసిన జక్కన్న


ఉక్రెయిన్‌లో పరిస్థితి, యుద్ధ వాతావరణం చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని రాజమౌళి చెప్పారు. అక్కడ షూటింగ్ చేసినప్పుడు రాజకీయ పరిస్థితులపై తమకు అవగాహన లేదని ఆయన తెలిపారు. చిత్రీకరణ సమయంలో తమకు ఎటువంటి సమస్యలు ఎదురు కాలేదన్నారు. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, తాను, తమ టీమ్‌లో ఇతర సభ్యులు ఉక్రెయిన్‌లో తమకు తెలిసిన వాళ్ళతో మాట్లాడామని రాజమౌళి (rajamouli) వివరించారు.
Also Read: 'ఎత్తర జెండా' సాంగ్ వచ్చేసిందోచ్!