యంగ్ హీరో మంచు విష్ణు అస్సలు తగ్గడం లేదు. వర్కవుట్స్, జిమ్ చేసే విషయంలో 'తగ్గేదే లే' అనేది ఆయన పాలసీ అనుకోవాలి. ఫిట్‌గా, చక్కటి ఫిజిక్ మెయింటైన్ చేసే టాలీవుడ్ యంగ్ హీరోల్లో మంచు విష్ణు ఒకరని చెప్పాలి. గతంలో ఆయన ప్యాక్డ్ బాడీతో కనిపించారు. ఇప్పుడు ప్యాక్డ్ బాడీ చూపించడం లేదు. కానీ, ఫిట్‌గా ఉన్నారని తెలుస్తోంది.


శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించనున్న 'ఢీ అండ్ ఢీ' (డబుల్ డోస్) కోసం కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా మంచు విష్ణు వర్కవుట్స్ చేస్తున్నారు. ఆ సినిమా కంటే ముందు 'గాలి నాగేశ్వరరావు' సినిమా స్టార్ట్ చేశారు. అయినా... వర్కవుట్స్ చేయడం మానలేదు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త వీడియో పోస్ట్ చేశారు. అందులో వర్కవుట్స్ చేస్తూ కనిపించారు. 'వర్కవుట్ చేసిన రోజే మంచి రోజు' అనే అర్థం వచ్చేలా కాప్షన్ ఇచ్చారు. వర్కవుట్ వీడియోస్ పోస్ట్ చేయడం ద్వారా ఫిట్‌గా ఉండాల‌నుకునే వ్య‌క్తుల‌కు మంచు విష్ణు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తున్నారని చెప్పవచ్చు.






Also Read: ఆమిర్ ఖాన్ మందేస్తే బాటిల్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! కానీ, ఇప్పుడు
ఇక, 'గాలి నాగేశ్వరరావు' సినిమా విషయానికి వస్తే... ప్రస్తుతం తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. అందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి మూల కథ అందించగా... ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read:  రామ్‌తో రష్మిక?