Aamir Khan: మందేస్తే బాటిల్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! కానీ, ఇప్పుడు

మీకు తెలుసా? ఆమిర్ ఖాన్ మందు అలవాటు గురించి! పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటపెట్టారు. అదేంటో చదవండి. 

Continues below advertisement

బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌కు మందు (ఆల్కహాల్) అలవాటు ఉందని తెలుసా? అదీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు! అవును... ఆమిర్ గతంలో మందు తాగేవారు. అయితే, ఇప్పుడు మానేశారు. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా హిందీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మందు అలవాటు గురించి వివరించారు.

Continues below advertisement

"నేను మందు తాగేవాడిని. కానీ, ఇప్పుడు తాగడం లేదు. కొంత మంది రెండు పెగ్గులు వేస్తారు. ఆ విధంగా, రెగ్యులర్ గా తాగే టైప్ కాదు నేను. అప్పుడప్పుడూ మాత్రమే తాగేవాడిని. అయితే, ఒక్కసారి కూర్చుంటే ఫుల్ బాటిల్ ఖాళీ అవ్వాల్సిందే. నాకు అది మంచిగా అనిపించలేదు. మత్తులో ఉన్నప్పుడు మనం చేసే పనుల వల్ల, మాట్లాడే మాటల వల్ల ఆ తర్వాత బాధపడతాం. నా విషయంలో ఎప్పుడూ అలా జరగలేదు. కానీ, మందులో ఉన్నప్పుడు మనిషి కంట్రోల్ లో ఉండదు.  అందువల్ల, నేను మందు మానేశాను" అని ఆమిర్ ఖాన్ వివరించారు.

Also Read: రామ్‌తో రష్మిక?

'సత్యమేవ జయతే' షో హోస్ట్ చేసిన ఆమిర్ ఖాన్, ఒక ఎపిసోడ్ ఆల్కహాల్ మీద చేశారు. పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల గురించి కూడా ఆమిర్ ఖాన్ మాట్లాడారు. "కిరణ్ రావుకు నేను అంటే ఎంతో గౌరవం. నాకూ ఆమె అంటే గౌరవం. మా ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంది. భార్యాభర్తలుగా మా బంధంలో మార్పు వచ్చింది. కానీ, మేం కలిసి పని చేస్తున్నాం. ఒకరికి ఒకరు దగ్గరలో ఉంటున్నాం" అని ఆమిర్ తెలిపారు.  

Also Read: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో అల్లు అర్జున్ భేటీ - ఇంకో #BB కాంబో రెడీ అవుతుందా?

Continues below advertisement