'అఖండ'తో దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ విజయం అందుకున్నారు. మాస్... ఊర మాస్ కమర్షియల్ చిత్రాలు తీయడంలో, సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు జోడించి చిత్రాలు తెరకెక్కించడంలో తన శైలి ఏంటనేది ఆయన మరోసారి చాటి చెప్పారు. 'అఖండ' విజయం తర్వాత ఉస్తాద్ రామ్ పోతినేనితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పనులు ప్రారంభించారు. హీరోయిన్, ఇతర నటీనటుల సెలక్షన్ ప్రక్రియ మొదలైందని తెలిసింది.


రామ్‌కు జోడీగా రష్మిక అయితే బావుంటుందని బోయపాటి శ్రీను భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని, నితిన్, శర్వాలతో రష్మిక నటించారు. ఇప్పటివరకూ రామ్ సరసన నటించలేదు. సో... వీళ్ళిద్దరి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని, పైగా సినిమాలో పాత్రకు పర్ఫెక్ట్ యాప్ట్ అని అనుకుంటున్నారట. ఆల్రెడీ రష్మికను అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.


పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకుని రామ్ - బోయపాటి సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ హిందీలో డబ్బింగ్ సినిమాలతో రామ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బోయపాటి శ్రీను సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ అయ్యాయి. వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక, రష్మికకు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  ఆమెను నేషనల్ క్రష్ అంటున్నారు అభిమానులు. 'పుష్ప'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. రామ్ - బోయపాటి శ్రీను సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకోవాలని అనుకోవడానికి పాన్ ఇండియా ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న క్రేజ్ కూడా ఒక కారణం.


Also Read: యూట్యూబ్‌లో ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌతిండియన్ హీరో రామ్


రామ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్న సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా 'ద వారియర్' సినిమాను నిర్మిస్తున్నది ఆయనే.


Also Read: రామ్ సినిమా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ ఎంతంటే?