ప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలు లేవు. టాలీవుడ్ సినిమాలను బాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. టాలీవుడ్ హీరోలకు ఉత్తరాది ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. హిందీలో డబ్బింగ్ చేసిన తెలుగు సినిమాలకు విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి. అందులో 'ఉస్తాద్' రామ్ పోతినేని సినిమాలు టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఆయన హిందీ వెర్షన్ సినిమాలకు వస్తున్న వ్యూస్ చూస్తుంటే... నార్త్ ఇండియన్ ఆడియ‌న్స్‌కు హాట్ ఫేవరెట్ హీరో అంటే రామ్ అంటున్నారు.

యూట్యూబ్‌లో రామ్ పోతినేని సినిమాలు అన్నిటికీ కలిపి 2 బిలియన్ వ్యూస్  వచ్చాయి. (రామ్ సినిమాలకు రెండు వందల కోట్ల వీక్షణలు వచ్చాయి). సౌత్ ఇండియా హీరోల్లో ఆ ఘనత సాధించిన తొలి హీరోగా రామ్ రికార్డ్ సృష్టించారు. ఏయే సినిమాలకు ఎన్ని వ్యూస్ వచ్చాయంటే...

  సినిమా పేరు హిందీ డబ్బింగ్ టైటిల్ యూట్యూబ్‌లో వ్యూస్‌
1 దేవదాసు సబ్ సే బడా దిల్ వాలా 32 మిలియన్స్ (వివిధ ఛానళ్లలో...)
2 జగడం డేంజరస్ ఖిలాడీ రిటర్న్స్  31 మిలియన్స్
3 మస్కా  పూల్ ఆర్ కాంటే  25 మిలియన్స్ (రెండు ఛానళ్లలో...) 
4 రామరామ కృష్ణకృష్ణ నఫ్రత్ కి జంగ్ 16 మిలియన్స్ (రెండు ఛానళ్లలో...)
5 గణేష్ క్షత్రియ ఏక్ యోధా 207 మిలియన్స్ (రెండు ఛానళ్లలో...)
6 కందిరీగ డేంజరస్ ఖిలాడీ 4  25 మిలియన్స్ (రెండు ఛానళ్లలో...)
7 ఎందుకంటే ప్రేమంట డేంజరస్ ఖిలాడీ 5 12 మిలియన్స్ 
8 మసాలా చీటర్ కింగ్  50 మిలియన్స్ (రెండు ఛానళ్లలో...)
9 పండగ చేస్కో బిజినెస్ మేన్ 2 23 మిలియన్స్
10 నేను శైలజ  ది సూపర్ ఖిలాడీ 3 440 మిలియన్స్ 
11 వున్నది ఒకటే జిందగీ నంబర్ 1 దిల్ వాలా 317 మిలియన్స్ (రెండు ఛానళ్లలో...)
12 హలో గురూ ప్రేమ కోసమే  దందార్ ఖిలాడీ 404 మిలియన్స్ 
13 హైపర్ సన్ ఆఫ్ సత్యమూర్తి 2  170 మిలియన్స్
14 ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ శంకర్ 225 మిలియన్స్

రామ్ అన్ని సినిమాలకు వచ్చిన టోటల్ వ్యూస్ చూస్తే... 2.07 బిలియన్స్ ఉన్నాయి. హిందీ ప్రేక్షకుల్లో రామ్ క్రేజ్, ఉత్తరాదిలో ఆయన మార్కెట్ సూపర్. రామ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 'ది వారియర్' సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్లకు అమ్ముడైంది.  'ది వారియర్' తర్వాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీనుకు కూడా హిందీలో మంచి మార్కెట్ ఉంది. వీళ్ళిద్దరూ చేయబోయే సినిమా హిందీలోనూ విడుదల కానుంది. దాంతో అక్కడి ప్రేక్షకుల్లో క్రేజ్ ఏర్పడింది.