'భీమ్లా నాయక్' సినిమా చూశారా? అందులో పవన్ కల్యాణ్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్ బండి నడిపారు కదా! ఆ బండి మీ సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారా? ఆ అవకాశాన్ని మీకు అందిస్తోంది ఆహా వీడియో ఓటీటీ. ఫేవరెట్ హీరో బండి సొంతం చేసుకోవాలనుకునే అభిమానుల కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. బండి మీకు కావాలంటే... మీరు ఒక పని చేయాలి.


ఈ రోజు నుంచి ఏప్రిల్ 1లోపు ఆహా వీడియోను స‌బ్‌స్రైబ్‌ చేసుకోవాలి. అలా స‌బ్‌స్రైబ్‌ చేసుకున్న వాళ్ళలో ఒకరికి బైక్ దక్కుతుంది. బైక్ ఎవరి సొంతం అవుతుందో? వెయిట్ అండ్ సీ. 'భీమ్లా నాయక్'లో పవన్ కల్యాణ్ రెండు బైక్స్ నడిపారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఒక బైక్ ఉంటే... పోలీస్ గా మరొక బైక్ నడిపారు. బుల్లెట్ బండిని ప్రేక్షకులకు ఇవ్వాలని ఆహా నిర్ణయించింది. 


మరికొన్ని గంటల్లో 'భీమ్లా నాయక్' సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఆహా వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికల్లో సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 


Also Read: 'ఆహా' Vs 'హాట్‌స్టార్' - ఓటీటీల్లో ముందుగానే వస్తున్న 'భీమ్లానాయక్'


పవన్ కల్యాణ్ సరసన నిత్యా మీనన్, రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ నటించిన 'భీమ్లా నాయక్'ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా... త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చారు. తమన్ సంగీతం అందించారు.


Also Read: 'బాహుబలి'కి బాబులా 'ఆర్ఆర్ఆర్:రౌద్రం ర‌ణం రుధిరం' ప్రీ రిలీజ్ బిజినెస్!