పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). They Call Him OG... అనేది ఉపశీర్షిక. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా యువ కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు.లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాలో మరో అమ్మాయి కూడా ఉన్నారు!


'ఓజీ'లో శ్రియా రెడ్డి... క్యారెక్టర్ సస్పెన్స్!
తెలుగమ్మాయి, నటి శ్రియా రెడ్డి 'ఓజీ'లో నటిస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ విలక్షణ నటికి స్వాగతం పలికింది. అయితే... ఆమె క్యారెక్టర్ ఏమిటనేది చెప్పలేదు. అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా కనుక... పవర్ ఫుల్ రోల్ ఉంటుందని ఆశించవచ్చు. 'ఓజీ'లో అర్జున్ దాస్ కూడా నటిస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. 


'పందెం కోడి' సినిమా తెలుగు, తమిళ భాషల్లో శ్రియా రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చింది. అంతకు ముందు 'పొగరు' సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. తెలుగులో 'అమ్మ చెప్పింది', 'అప్పుడప్పుడు' సినిమాలు చేశారు. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' కూడా చేస్తున్నారు. 


ఓజీ షూటింగుకు ఇబ్బంది లేదు!
పవన్ కళ్యాణ్ 'వారాహి' యాత్ర మొదలు కానున్న నేపథ్యంలో 'ఓజీ' సహా మిగతా సినిమా షూటింగులకు బ్రేక్ వస్తుందని కొందరు భావించారు. అయితే, అటువంటి సందేహాలకు పవన్ & దర్శక, నిర్మాతలు చెక్ పెట్టారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజకీయాలతో పాటు సినిమా షూటింగులకు టైమ్ కేటాయిస్తానని పవన్ చెప్పడంతో ఏపీలో షూటింగులు జరగనున్నాయి. జూన్ తొలి వారంలో హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులు షూటింగ్స్ చేశారు. 


'ఓజీ' చిత్రానికి పవర్ స్టార్ అభిమాని, 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ముంబైలో ఓ షెడ్యూల్ చేశారు. అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఆయన కూడా షూటింగులో జాయిన్ అయ్యారు. 


Also Read : మరో మెగా హీరో సినిమాలో 'ఏజెంట్' భామ సాక్షి వైద్య



'బ్రో' తర్వాత 'ఓజీ' వస్తుందా?
'ఓజీ' చిత్రీకరణ అక్టోబర్ నెలకు పూర్తి అయితే పవర్ స్టార్ అభిమానులకు పండగే. జూలై 28న 'బ్రో' ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత 'ఓజీ' విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది పవన్ నుంచి మరో సినిమా రావచ్చు. 


'బ్రో', 'ఓజీ' కాకుండా... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే, అందులో హరీష్ శంకర్ సినిమా ముందు కంప్లీట్ కావచ్చు. ఆ సినిమాను  వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.  అయితే, ఆ సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని గుసగుస. 


Also Read పూజా హెగ్డే డిమాండ్ తగ్గలేదు - ఏకంగా ఆరు సినిమాలు...