'కొత్త బంగారు లోకం' నుంచి 'నారప్ప' వరకు... శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)  దర్శకత్వం వహించిన సినిమాల్లో కుటుంబ అనుబంధాలు ఎక్కువ. 'ముకుంద'లో రాజకీయాల ప్రస్తావన ఉంది. 'నారప్ప'లో అగ్ర వర్ణాల చేతిలో అవమానాలు ఎన్నో ఎదుర్కొన్న కుటుంబ కథను మాస్ పంథాలో చెప్పారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'పెద్ద కాపు 1' (Pedda Kapu Telugu Movie). అణచివేత, ఘర్షణల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పొల్లాచ్చిలో జరుగుతోంది. 

Continues below advertisement


పొల్లాచ్చిలో 'పెద్ద కాపు 1' చివరి పాట
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కిస్తోన్న సినిమా 'పెద్ద కాపు' (Peddha Kapu Movie). మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ (Virat Karrna), ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్ర పోషించారు.


''పెద్ద కాపు 1'లో చివరి పాట చిత్రీకరణ ఈ రోజు (బుధవారం, ఆగస్టు 9) నుంచి పొల్లాచ్చిలో జరుగుతోంది. విరాట్ కర్ణ, ప్రగతిపై భారీ ఎత్తున చిత్రీకరిస్తున్న ఈ పాట రాజు సుందరం నృత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సినిమాలో ఈ పాట చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటతో చిత్రీకరణ పూర్తి అవుతుంది'' అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు. 


నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'అఖండ'తో ద్వారకా క్రియేషన్స్ సంస్థ భారీ విజయం అందుకుంది. దానికి ముందు కూడా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'జయ జానకి నాయక' తీశారు. ఇప్పటి వరకు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి, తొలిసారి తన బంధువును హీరోగా పరిచయం చేస్తూ సినిమా చేశారు.


Also Read : త్వరలో విజయ్ దేవరకొండ పెళ్లి - 'ఖుషి' ట్రైలర్ లాంచ్‌లో రౌడీ బాయ్ ఏం చెప్పారంటే?



'చనువుగా చూసిన' పాటకు అద్భుత స్పందన
'పెద్ద కాపు 1' సినిమాలో తొలి పాట 'చనువుగా చూసిన...' (Chanuvuga Chusina Song) పాట గత నెలలో విడుదలైంది. ఇంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల తీసిన పలు సినిమాలకు మ్యూజిక్ అందించిన మిక్కీ జె మేయర్ ఈ సినిమాకూ పని చేస్తున్నారు. ఆ పాటకు లభిస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని అందిస్తోందని దర్శక నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.    


ఆగస్టు 18న 'పెద్ద కాపు' విడుదల
ఆల్రెడీ విడుదల చేసిన 'పెద్ద కాపు' టీజర్ మీద ప్రేక్షకుల దృష్టి పడింది. ఆంధ్రుల ఆత్మ గౌరవం గురించి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన రాజకీయ ప్రసంగంతో ఆ టీజర్ మొదలైంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న గ్రామంలో సాధారణ వ్యక్తి పాలన చేపట్టడం అనేది ఈ సినిమా కథాంశం.  సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. గ్రామ నాయకులుగా రావు రమేష్ , ఆడుకలం నరేన్ పవర్ ఫుల్ గా కనిపించారు.  తనికెళ్ల భరణి, నాగబాబు ప్రజన్స్ ఆకట్టుకుంది. 


Also Read మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial