మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'భోళా శంకర్' (Bholaa Shankar Movie). సంక్రాంతి హిట్ 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరు నుంచి వస్తున్న చిత్రమిది. అందుకని, అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఆ సినిమా స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు. బహుశా, సంక్రాంతి సీజన్ కాకపోవడం ఒక కారణమైతే, తమిళంలో అజిత్ హీరోగా దర్శకుడు శివ తీసిన 'వేదాళం' రీమేక్ కావడం మరో కారణం ఏమో!? అసలు, 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? వంటి వివరాల్లోకి వెళితే...


'వాల్తేరు వీరయ్య' కంటే తక్కువే కానీ...
Bholaa Shankar Theatrical Rights : 'భోళా శంకర్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ మొత్తాన్ని సుమారు రూ. 80 కోట్లకు విక్రయించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ బిజినెస్ (88 కోట్ల రూపాయలు) కంటే తక్కువ రేటుకు సినిమాను ఇచ్చారు. ఆ మాటకు వస్తే... రీ ఎంట్రీ తర్వాత చిరు సినిమాల్లో తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కూడా 'భోళా శంకర్' సినిమాయే!


'ఖైదీ నంబర్ 150' రూ. 89 కోట్లు, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసిన ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 'సైరా నరసింహా రెడ్డి' రూ. 187 కోట్లు, 'ఆచార్య' రూ. 131 కోట్లు బిజినెస్ చేశాయి. 'ఆచార్య' డిజాస్టర్ తర్వాత 'గాడ్ ఫాదర్' వచ్చింది. పలు ఏరియాల్లో ఆ సినిమాను అమ్మలేదు. నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ సీడెడ్ ఏరియాలోసొంతంగా విడుదల చేశారు. అదే విధంగా కొన్ని ఏరియాలను తెలిసిన వాళ్ళ చేత విడుదల చేయించారని ఫిల్మ్ నగర్ టాక్. 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 90 కోట్లుగా లెక్క కట్టారు.        


బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?
Bholaa Shankar Break Even Collection : 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్ల రూపాయలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే... దానికి కనీసం ఒక్క కోటి ఎక్కువ షేర్ రాబట్టాలి. అంటే... మినిమమ్ 81 కోట్ల రూపాయల షేర్ రావాలి. ఎలా లేదన్నా 130, 140 కోట్ల రూపాయల గ్రాస్ రావాలి. 'వాల్తేరు వీరయ్య' ట్రాక్ రికార్డ్ చూస్తే... అది ఏమంత కష్టంగా కనిపించడం లేదు.


Also Read రికార్డుల వేటకు రజనీ 'జైలర్' రెడీ - ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంత రావచ్చంటే...


'భోళా శంకర్' సినిమాకు ఉన్న ఒక్కటే సమస్య... 'వేదాళం' రీమేక్ కావడం! అజిత్ సినిమాలో సోల్ పాయింట్ (బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్) తీసుకుని చిరంజీవి ఇమేజ్, అభిమానులు ఆయన నుంచి ఆశించే అంశాలను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేశామని దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. రిజల్ట్ ఎలా ఉంటుందో? రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. అనిల్ సుంకరకు చేసిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి జోడీగా తమన్నా, సోదరిగా కీర్తీ సురేష్ నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.  


Also Read : 'గుంటూరు కారం'లో వాళ్ళిద్దర్నీ మార్చలేదు - మహేష్ బర్త్‌డే పోస్టర్‌తో క్లారిటీ





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial