పెళ్లి ఎప్పుడు? జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో కచ్చితంగా ఎదురు అయ్యే ప్రశ్న! అందులోనూ అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు తప్పకుండా ఈ ప్రశ్న ఎదుర్కోవాలి. రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) వంటి కథానాయకుడికి పెళ్లి, భార్య భర్తల మధ్య వైవాహిక సంబంధం నేపథ్యంలో సినిమా చేసినప్పుడు ఆ ప్రశ్న లేకుండా ఎలా ఉంటుంది?


పెళ్లి అంటే ఏం గుర్తుకు వస్తుంది?
Vijay Deverakonda On Marriage : 'పెళ్లి అంటే మీ మనసులో ముందు ఏం గుర్తుకు వస్తుంది?' అని 'ఖుషి' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో విజయ్ దేవరకొండకు ఓ ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ''త్వరలో నేను కూడా (పెళ్లి) చేసుకోవాలి. ఆ ఘడియలు దగ్గరలో ఉన్నాయని అనిపిస్తోంది'' అని! దీన్ని బట్టి విజయ్ దేవరకొండ పెళ్లికి రెడీ అయినట్లు ఉన్నారు. 


పెళ్లి అంటే భయపడుతున్నారా?
మీరు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారా? అని అడగ్గా... ''ఇంతకు ముందు ఎవరైనా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకు వస్తే ఇరిటేషన్ వచ్చేది. పెళ్లి గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నా స్నేహితులకు పెళ్లిళ్లు అవుతున్నాయి. వాళ్ళను చూసి ఎంజాయ్ చేస్తున్నాను. వైవాహిక బంధంలో హ్యాపీగా ఉన్నవాళ్లు ఉన్నారు. ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ప్రతిదీ ఎంటర్టైనింగ్‌గా ఉంది'' అని విజయ్ దేవరకొండ చెప్పారు.


వైవాహిక బంధంలో భయపెట్టే అంశాల జోలికి వెళితే పెళ్లి చేసుకోలేమని, పెళ్లిలో అందమైన మూమెంట్స్ చూసి ఏడు అడుగులు వేయాలని విజయ్ దేవరకొండ తెలిపారు. పెళ్లి ప్రస్తావన రావడానికి ముందు 'జంట మధ్య బంధం బావుండాలని ఏం కావాలి?' అని విజయ్ దేవరకొండను అడిగితే... ''జీవిత భాగస్వామి నచ్చాలి. ప్రేమించాలి. జీవితంలో ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు... అర్థం చేసుకోవాలి'' అని ఆయన సమాధానం ఇచ్చారు. 


Also Read : మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత లోయస్ట్ ప్రీ రిలీజ్ రికార్డ్ 'భోళా శంకర్'దే - బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?



అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చే 'ఖుషి'
'ఖుషి'ని ఎందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు? అని అడిగితే... ''సాధారణంగా మనం భారీ మాస్, కమర్షియల్ సినిమాలను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నాం. 'ఖుషి'ని రెవెన్యూ కోసం పాన్ ఇండియా రిలీజ్ చేయడం లేదు. అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర చేరువ కావడం కోసమే చేస్తున్నాం. 'ఖుషి' అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నా. ప్రేమకు భాష లేదు'' అని విజయ్ దేవరకొండ చెప్పారు. 

Also Read రికార్డుల వేటకు రజనీ 'జైలర్' రెడీ - ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంత రావచ్చంటే...


'ఖుషి' కథ అంతా ట్రైలర్‌లో రివీల్ చేసేశారు. విజయ్ దేవరకొండ కశ్మీర్ వెళతారు. ముస్లిం అమ్మాయిని చూసి ప్రేమిస్తారు. అయితే... ఆ అమ్మాయి తాను బేగం కాదని, బ్రాహ్మణ యువతి అని చెబుతారు. వాళ్ళ ఇరు కుటుంబాలకు పరిచయం ఉంది. విజయ్ దేవరకొండతో పెళ్లికి సమంత తండ్రి మురళీ శర్మ అంగీకరించరు. ఇద్దరికి పెళ్లి అయితే ఎన్ని సమస్యలు రావాలో... అన్నీ వస్తాయని చెబుతారు. అయినా సరే ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి మధ్య వచ్చిన సమస్య ఏమిటి? దోష పరిహారం కోసం ఏం చేశారు? అనేది సినిమా కథ అనేది ఈజీగా అర్థం అవుతోంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial