డాషింగ్ హీరో, రౌడీ బాయ్ 'ది' విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన సమంత (Samantha) కథానాయికగా నటించిన సినిమా 'ఖుషి' (Kushi Movie). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 


సమంత బేగమ్ కాదు.... బ్రాహ్మణ యువతి!
Kushi Trailer Review : 'ఖుషి' కథ ఏమిటి? అనేది మొత్తం అంతా ట్రైలర్‌లో రివీల్ చేసేశారు. విజయ్ దేవరకొండ కశ్మీర్ వెళతారు. అక్కడ ఓ ముస్లిం అమ్మాయిని చూస్తారు. అయితే... ఆ అమ్మాయి తాను బేగం కాదని, బ్రాహ్మణ యువతి అని చెబుతారు. కట్ చేస్తే... ఇద్దరికీ ఒకటే ఊరు. వాళ్ళ ఇరు కుటుంబాలకు పరిచయం ఉంది.


విజయ్ దేవరకొండతో పెళ్లికి సమంత తండ్రి మురళీ శర్మ అంగీకరించరు. ఇద్దరికి పెళ్లి అయితే ఎన్ని సమస్యలు రావాలో... అన్నీ వస్తాయని చెబుతారు. అయినా సరే ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ఇద్దరి మధ్య వచ్చిన సమస్య ఏమిటి? దోష పరిహారం కోసం ఏం చేశారు? అనేది సినిమా కథ అనేది ఈజీగా అర్థం అవుతోంది. 


సమంతను 'నా పిల్ల' అంటూ విజయ్ దేవరకొండ చెప్పడం హైలైట్. 'ఖుషి' ట్రైలర్ అంతా ఒక ఎత్తు... చివర్లో 'ఎందుకు భయపడుతున్నావ్ అమ్మా నువ్వు? మార్కెట్ లో నా గురించి అలా అనుకుంటున్నారు గానీ నేను స్త్రీ పక్షపాతిని అని చెప్పడం' సూపర్!


Also Read 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?



సెప్టెంబర్ 1న 'ఖుషి' విడుదల
పాన్ ఇండియా సినిమాగా 'ఖుషి' తెరకెక్కుతోంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి'ని విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో సమంత కశ్మీరీ యువతిగా నటిస్తున్నట్లు సమాచారం. అందుకని, కొన్ని సీన్లలో ఆమె ఆహార్యం ముస్లిం యువతిగా ఉందని టాక్. హీరోతో ముస్లిం యువతి పెళ్లి తర్వాత ఏమైంది?  అనేది కథగా తెలుస్తోంది.


Also Read రికార్డుల వేటకు రజనీ 'జైలర్' రెడీ - ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంత రావచ్చంటే...



ద్రాక్షారామం గుడిలో కొన్ని సీన్లు!
ఇటీవల 'ఖుషి' సినిమా చిత్రీకరణ ముగిసింది. అప్పుడు హైదరాబాద్ సిటీలో విజయ్ దేవరకొండ కేక్ కట్ చేశారు. అంతకు ముందు ఏపీలోని ద్రాక్షారామంలోని దేవాలయంలో 'ఖుషి' చిత్రీకరణ జరిగింది. ఆ షూటింగులో మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్ కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరూ యాగం చేస్తుంటే... వెనుక విజయ్ దేవరకొండ, సమంత నిలబడి ఉన్నారు. ఆల్రెడీ విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సూపర్ హిట్ అయ్యాయి. 


మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు 'ఖుషి'లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు : శివ నిర్వాణ, పోరాటాలు : పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.





ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial