Just In





Shreya Ghoshal Twitter Hacked: స్టార్ సింగర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... మస్క్ మామ టీంకు చెప్పినా 'నో' రెస్పాన్స్
Shreya Ghoshal X account Hacked: ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అదీ ఇప్పుడు కాదు, ప్రేమికుల రోజుకు కొన్ని గంటల ముందు! దాని గురించి ఆవిడ ఒక స్పెషల్ పోస్ట్ చేశారు.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అది కూడా నిన్న లేదంటే ఇవాళ జరిగింది కాదు. సుమారు 20 రోజుల క్రితం జరిగింది. ప్రేమికుల రోజుకు కొన్ని గంటల మందు... ఫిబ్రవరి 13వ తేదీన తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయా ఘోషల్ తెలిపారు.
మస్క్ మామ టీం నుంచి నో రెస్పాన్స్!
'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయిన నుంచి ట్విట్టర్ టీంను సంప్రదించడానికి తాను తన శాయశక్తులా కృషి చేస్తున్నానని శ్రేయా ఘోషల్ వివరించారు. అయితే వాళ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని, కొన్ని ఆటో రిప్లైలు మాత్రమే వస్తున్నాయని ఆవిడ తెలిపారు. ట్విట్టర్ ఖాతాలో తాను లాగిన్ కావడానికి కుదరడం లేదని, అందువల్ల డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా సక్సెస్ కాలేదని శ్రేయా ఘోషల్ తెలిపారు.
అప్పటి వరకు ఆ లింక్స్ క్లిక్ చేయకండి!
శ్రేయా ఘోషల్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తులు అందులో కొన్ని లింక్స్ పోస్ట్ చేస్తున్నారు. వాటిని క్లిక్ చేయవద్దని శ్రేయా ఘోషల్ రిక్వెస్ట్ చేశారు. హ్యాకర్స్ నుంచి తన ఖాతా మళ్లీ తన వద్దకు వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తానని అప్పటి వరకు ఆ అకౌంటును ఫాలో కావద్దని ఆవిడ రిక్వెస్ట్ చేశారు.
Also Read: స్టార్ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?
నానా హైరానా... లేటెస్ట్ చార్ట్ బస్టర్!
తెలుగులో శ్రేయా ఘోషల్ పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఈ మధ్య కాలంలో ఆవిడ పాడిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటే 'గేమ్ చేంజర్' సినిమాలోని 'నానా హైరానా...' సాంగ్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది. మృణాల్ ఠాకూర్ సైతం ఇటీవల తన లేటెస్ట్ ఫేవరెట్ సాంగ్ అదేనని పేర్కొన్నారు.