షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) వ్యవహారశైలి మీద 'ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ' (FEFKA) ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఇదే లాస్ట్' అంటూ ఆయనకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. ఇంకోసారి ఇటువంటివి రిపీట్ అయితే బాగొదంటూ గట్టిగా చెప్పింది. అలాగే డ్రగ్స్ వాడకం గురించి అతని కుటుంబ సభ్యులకు కొన్ని సూచనలు చేసింది.
విన్సీతో అసభ్య ప్రవర్తన...
అరెస్ట్ నుంచి బెయిల్ వరకు!
'సూత్రవాక్యం' చిత్రీకరణలో ఫిమేల్ ఆర్టిస్ట్ విన్సీ అలోషియస్ (Vincy Aloshious)తో షైన్ టామ్ చాకో అసభ్యంగా ప్రవర్తించారు. ఆవిడ ఆ విషయాన్ని కేరళ ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకు వెళ్ళింది. లీగల్ కేసుకు వెళ్లకుండా సినిమా ఇండస్ట్రీలో పెద్దల దగ్గర షైన్ టామ్ చాకో వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని భావించింది. అయితే కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజీ నంతియట్టు హీరో పేరును బయట పెట్టారు. దాంతో అతడి ఇంటి మీద రైడ్ చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో బెయిల్ కూడా వచ్చింది. నేషనల్ మీడియాలోనూ కేసు హైలైట్ అయ్యింది. దాని మీద విన్సీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Also Read: ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?
షైన్ టామ్ చాకో వ్యవహారం వైరల్ కావడంతో 'ది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ' (FEFKA) రంగంలోకి దిగింది. అతడికి ఫైనల్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు డ్రగ్స్ (Drugs)కు బానిస కాకుండా ఆ మత్తు పదార్థాలు వినియోగం నుంచి బయట పడేందుకు అవసరం అయితే ప్రొఫెషనల్స్ (వైద్యుల) హెల్ప్ తీసుకోవాలని షైన్ టామ్ చాకో ఫ్యామిలీకి సూచించింది.
విన్సీకి సారీ చెప్పిన షైన్ టామ్ చాకో!
Shine Tom Chacko apologies to Vincy Aloshious: కేరళలోని కొచ్చిలో ఇటీవల ఒక ఇంటర్నల్ కమిటీ మీటింగ్ జరిగిందని, అందులో విన్సీకి షైన్ టామ్ చాకో సారీ చెప్పారని మాలీవుడ్ టాక్. అది తన న్యాచురల్ స్టైల్ అన్నట్టు అతడు చెప్పాడట. తాను కావాలని అలా చేయలేదని, అలా జరిగిపోయిందని ఆయన వివరించారట.
కేరళ ఫిలిం ఇండస్ట్రీ పెద్దల నేతృత్వంలో జరిగిన ఇంటర్నల్ కమిటీ మీటింగ్ కు ఫ్యామిలీతో కలిసి షైన్ టామ్ చాకో హాజరు కాగా... విన్సీ ఒంటరిగా వచ్చినట్టు మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నల్ కమిటీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని, షైన్ టామ్ చాకో మీద లీగల్ కంప్లైంట్ ఇచ్చే ఉద్దేశం లేదని విన్సీ స్పష్టం చేశారట. నాని 'దసరా' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి షైన్ టౌన్ చాకో పరిచయం అయ్యారు. అందులో విలన్ రోల్ చేశారు. నాగశౌర్య 'రంగబలి'లో కూడా ఆయన విలన్. తర్వాత ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో కనిపించారు. బాలకృష్ణ 'డాకు మహారాజ్', నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత