గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పుట్టిన రోజు వచ్చిందంటే అభిమానులకు పండగ రోజే. ఆ పండుగను మరింత స్పెషల్ చేసేందుకు కంటెంట్ ఉన్న కమర్షియల్ సినిమాలు తీసే స్పెషలిస్ట్, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను రెడీ అయ్యారు.
బాలకృష్ణ బర్త్ డేకి 'అఖండ 2' టీజర్!Akhanda 2 Thandavam teaser release date: 'సింహ', 'లెజెండ్', 'అఖండ'... నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'అఖండ 2'. దీంతో డబుల్ హ్యాట్రిక్ కోసం శ్రీకారం చుట్టారు. ఈ సినిమా టీజర్ బాలకృష్ణ పుట్టిన రోజు (Balakrishna Birthday) సందర్భంగా జూన్ 10వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
జార్జియా వెళ్తున్న బాలయ్య అండ్ టీం!Akhanda 2 team plans Georgia schedule: 'అఖండ 2' కోసం కుంభమేళాతో పాటు హిమాలయాల్లో కొంత షూట్ చేశారు. హైదరాబాద్ సిటీలో కూడా ఒక షెడ్యూల్ చేశారు. ఇప్పుడు సినిమా యూనిట్ ఫారిన్ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది. మే నెలలో బాలకృష్ణతో పాటు కీలక తారాగణం జార్జియా వెళ్లడానికి రెడీ అవుతున్నారు. సుమారు నెల పాటు... మే అంతా జార్జియాలో షూటింగ్ ప్లాన్ చేశారు దర్శకుడు బోయపాటి శ్రీను.
Also Read: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
జార్జియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత టీజర్ పనుల మీద బోయపాటి శ్రీను దృష్టి పెడతారు. 'అఖండ' భారీ విజయం సాధించిన నేపథ్యంలో 'అఖండ 2 తాండవం' మీద ప్రేక్షకుల్లో, మరీ ముఖ్యంగా అభిమానుల్లో ఎటువంటి అంచనాలు ఉన్నాయో బోయపాటి శ్రీనుకు తెలుసు. అంచనాలకు మించి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఆయన కృషి చేస్తున్నారు.
బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా సంయుక్త!Akhanda 2 movie actress name: 'అఖండ' సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ రోల్ చేశారు. అయితే సీక్వెల్ వచ్చేసరికి హీరోయిన్ మారింది. 'విరూపాక్ష'తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాలో నటించిన సంయుక్తను కథానాయికగా తీసుకున్నారు. బాలకృష్ణతో ఆమెకు తొలి చిత్రమిది. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు కెమెరా వర్క్: సి రాంప్రసాద్, సంతోష్ డి డిటాకే, కళా దర్శకత్వం: ఏఎస్ ప్రకాష్, కూర్పు: తమ్మిరాజు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్ - లక్ష్మణ్.
Also Read: ఎంగేజ్మెంట్, మ్యారేజ్ ఫోటోలు డిలీట్... విడాకుల దిశగా సింగర్ హారికా నారాయణ్?
బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ పతాకం మీద రామ్ ఆచంట, గోపి ఆచంట 'అఖండ 2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. 'అఖండ' చిత్రానికి ఆయన అందించిన నేపథ్య సంగీతం థియేటర్లలో పూనకాలు తెప్పించింది. బాలకృష్ణ సినిమా అంటే తమన్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేస్తారని పేరు ఉంది. బాలకృష్ణ సైతం ఆయనకు ఎన్.బి.కె తమన్ అని నామకరణం చేశారు. అభిమానులు అయితే నందమూరి తమన్ అని పిలుస్తున్నారు.