Shahid Kapoor in Animal Park: 'యానిమల్‌' బ్లాక్‌బాస్టర్‌ హిట్‌. 2023 టాప్‌ మోస్ట్‌ సినిమాల్లో ఒకటి. ఇక థియేటర్లలోనే కాదు.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ని కూడా ఏలుతోంది ఈ సినిమా. టాప్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది 'యానిమల్‌'. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా 'యానిమల్‌ పార్క్‌' కోసం ఎదురుచూస్తున్నారు. అదీ కాకుండా సినిమా చివర్లో సీక్వెల్‌కి సంబంధించి హింట్‌ ఇచ్చి ఉత్కంఠ రేపాడు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ. 


పార్ట్‌ - 2లో కబీర్‌సింగ్‌ 


'యానిమల్‌ పార్క్‌'కి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలైపోయింది. ఈ 2025కి సినిమా షూటింగ్‌ ప్రారంభం అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పార్ట్‌- 2 ఇంకా బోల్డ్‌గా, ఇంకా కాంప్లెక్స్‌గా ఉంటుందని హీరో రణ్‌బీర్‌కపూర్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్‌ పెరిగిపోయింది. పార్ట్‌ - 1 ఎండింగ్‌లో అజీజ్‌, హీరో విజయ్‌ (రణ్‌బీర్‌) లాగా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని పగ తీర్చుకునేందుకు సిద్ధపడతాడు. దీంతో పార్ట్‌ - 2 మొత్తం అజీజ్‌, విజయ్‌ల మధ్యే పోరాటం ఉండబోతోంది. 


ఇదిలా ఉంటే.. 'యానిమల్‌ పార్క్‌'లో కబీర్‌ సింగ్‌ క్యారెక్టర్‌ ఉండే అవకాశం ఉన్నట్లు లీక్‌ చేశాడు షాహిద్‌ కపూర్‌. బాలీవుడ్‌ బబుల్‌తో కన్వర్జేషన్‌ మధ్యలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 'యానిమల్‌ పార్క్‌'లో కబీర్‌సింగ్‌ పాత్ర ఉండే అవకాశం ఉందని అన్నారు. రెండు పాత్రలకు క్రాస్‌ఓవర్‌ అయ్యే అవకాశం ఉందని, దానికి తను చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నానని చెప్పారు. అయితే, రెండు క్యారెక్టర్లకు చాలా డిఫరెన్స్‌ ఉందని మెటీరియలైజ్‌ చేస్తే చాలా బాగుంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు షాహిద్‌కపూర్‌. 


ఇక తను 2025 నుంచి 'యానిమల్‌ పార్క్‌' షూటింగ్‌లో పాల్గొంటానని రణ్‌బీర్‌ చెప్పారు. దానికి సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలవుతోందని అన్నారు. ఇక షాహిద్‌ కపూర్‌ 'తేరీ బాతోన్‌ మైన్‌ ఐసా ఉల్జా జియా' సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా ఉన్నారు. అమిత్‌ జోషి, ఆరాధనా షా డైరెక్ట్‌ చేసిన ఈ సినిమాలో కృతి సనన్‌ హీరోయిన్‌. సీనియర్‌ యాక్టర్‌ ధర్మేంద్ర కూడా ఈ సినిమాలో ఉన్నారు. కాగా.. ఫిబ్రవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


షాహిద్‌కపూర్‌ నటించిన 'కబీర్‌ సింగ్‌' బాలీవుడ్‌లో పెద్ద హిట్‌ అయ్యింది. ఆయన క్యారెక్టర్‌కి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక 'యానిమల్‌' సినిమాలో రణ్‌బీర్‌కి ఫిలిమ్‌ఫేర్‌ అవార్డు వచ్చింది. దీంతో ఇక ఈ రెండు క్యారెక్టర్లు క్రాస్‌ఫైర్‌ అయితే బాక్సాఫీస్‌ దగ్గర రికార్డుల మోత మోగడం  ఖాయం. తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన 'అర్జున్‌రెడ్డి' సినిమాకి రీమేక్‌ 'కబీర్‌ సింగ్‌'. తెలుగులో దానికి సందీప్‌ రెడ్డి వంగ డైరెక్షన్‌ చేశారు. హిందీలో కూడా ఆయనే రీమేక్‌ చేశారు. 'కబీర్‌సింగ్‌' ఇంకా 'యానిమల్‌' సినిమాలు రెండూ సందీప్‌ దర్శకత్వం కావడంతో ఈ రెండు క్యారెక్టర్లు క్రాస్‌ఫైర్‌ చేస్తారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి అది జరుగుతుందో లేదో.


Also Read: ఫస్ట్ టైమ్ ఆ దేశంలో అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ - అంతా ‘హనుమాన్’ మహిమే!