Priyanka Chopra Cousin Meera Chopra Marriage in March : ప్రియాంక చోప్రా కజిన్, బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే ప్రియాంక చోప్రా మరో కజిన్ కూడా పెళ్లికి రెడీ అవుతోంది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి తెలుగు హీరోయిన్ మీరా చోప్రా. ఈమె పేరు తెలియకపోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బంగారం' సినిమా హీరోయిన్ అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది..
అవును.. నేను పెళ్లి చేసుకోబోతున్నాను
మీరా చోప్రా ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్ లో తన పెళ్లి గురించి ఓపెన్ అవుతూ.." అవును. నిజమే.. నేను పెళ్లి చేసుకుంటున్నాను.. 2024 ఫిబ్రవరి నెలాఖరున పెళ్లి జరగనుంది. అందుకు సంబంధించిన సన్నాహాల్లో నా కుటుంబ సభ్యులు చురుగ్గా నిమగ్నమయ్యారు. వేడుకను మా కుటుంబీకులే నిర్వహిస్తున్నారు.. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాజస్థాన్‌లో కేవలం 150 మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నారు'' అని మీరా చెప్పారు.
రాజస్థాన్ లో మీరా చోప్రా పెళ్లి
మీరా చోప్రా తాజాగా తన పెళ్లికి సంబంధించిన వివరాలను తెలిపింది." నేను మార్చిలో పెళ్లి చేసుకోబోతున్నాయి. ఇప్పటికే పెళ్లి పనులు జరుగుతున్నాయి. డిస్టినేషన్ కూడా ఫైనల్ చేశాం. త్వరలోనే కంప్లీట్ డీటెయిల్స్ మీతో పంచుకుంటాను. పెళ్లి మాత్రం రాజస్థాన్ లో" అంటూ పేర్కొంది. అంతేకాకుండా.." ముంబైలో ఉన్న నా ఫ్రెండ్స్ అందరినీ అక్కడికి పిలుస్తాను. నాకు క్లాసికల్ హిందూ వెడ్డింగ్ కావాలి. ఎందుకంటే ప్రస్తుతం హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకోవడం సరైన మార్గం. మా కజిన్ ప్రియాంక, నిక్ లను పెళ్లికి ఆహ్వానిస్తాను.. వాళ్ళు ఖాళీగా ఉంటే కచ్చితంగా వస్తారు" అని చెప్పింది.
తమిళ సినిమాతో హీరోయిన్ గా అరంగేట్రం
మీరా చోప్రా 2005 లో ' అన్బే ఆరోయిరె' అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత తమిళం తో పాటు హిందీ, తెలుగు భాషల్లో నటించింది. 2016లో '1920: లండన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 'గ్యాంగ్ ఆఫ్ గోస్ట్స్', 'సెక్షన్ 375'లో సినిమాల్లో కనిపించింది. అంతే కాకుండా టాలీవుడ్‌లో పవన్ కల్యాణ్ సరసన 'బంగారం, నితిన్ తో 'మారో' కోలీవుడ్ హీరో విజయ్ రాయ్ సరసన 'వాన' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో 'వాన', 'బంగారం' సినిమాలతో హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది. ప్రస్తుతం హిందీలో ఈ హీరోయిన్ నటించిన 'సఫేద్' అనే సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సందీప్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అభయ్ వర్మ, బర్ఖా బిష్త్, జమీల్ ఖాన్, ఛాయా కదమ్ తదితరులు నటించారు.
Also Read : ప్రభాస్‌కు షాకిచ్చిన హాలీవుడ్ - ‘కల్కి 2928 AD’కి ఆ సమస్య తప్పదా?