Senior Actress Priyamani Speech At 'Bhamakalapam2' Trailer Launch : సీనియర్ నటి ప్రియమణి తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఓవైపు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న ఈమె మరోవైపు లీడ్ రోల్స్‌లో వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే 2022లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామాకలాపం' మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.


తెలుగు ఓటీటీ 'ఆహా'లో రిలీజైన ఈ సిరీస్ కి ఇప్పుడు సీక్వెల్ రాబోతోన్న విషయం తెలిసిందే  'భామ కలాపం 2' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ని అభిమన్యు డైరెక్ట్ చేశారు ఈ ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రియమణి స్టేజ్ పై పాట పాడి అదరగొట్టారు


మగవాళ్ళందరికి సారీ చెప్తున్నా


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్, ప్రియమణి జంటగా నటించిన 'గోలిమార్' సినిమాలో 'మగాళ్లు వట్టి మాయగాళ్లే 'అనే సాంగ్ అప్పటికీ, ఇప్పటికీ ఎంత ఫేమస్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రియమణిని చూసినప్పుడల్లా అందరికీ ఇదే పాట గుర్తొస్తుంది. అందుకే 'భామాకలాపం2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో భాగంగా స్టేజ్ పైకి వచ్చిన ప్రియమణిని యాంకర్ పాట పాడమని రిక్వెస్ట్ చేయగా.. ప్రియమణి పాడే ముందు మగవాళ్ళందరికీ సారీ చెప్పి 'మగాళ్లు వట్టి మాయగాళ్లే' సాంగ్ ని ఫుల్ జోష్ తో పాడి అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 


'భామ కలాపం' గురించి


పక్క వాళ్ళ విషయాల పట్ల ఆసక్తిని చూపే అనుపమ(ప్రియమణి) అనే మధ్యతరగతి గృహిణి ఓ మర్డర్ కేసులో ఎలా చిక్కుకుంది? ఆ నేరం నుంచి బయట పడేందుకు ఆమె చేసే ప్రయత్నాల నేపథ్యంలో భామాకలాపం మూవీ తెరకెక్కింది. ఇక దానికి సీక్వెల్ గా రాబోతున్న 'భామాకలాపం 2' కూడా క్రైమ్ కామెడీ పాయింట్ తోనే  రూపొందుతోంది. అయితే ఈసారి క్రైమ్, థ్రిల్లింగ్ ఎలివెంట్స్ డోస్ పెంచినట్లు గా తెలుస్తోంది.


'భామా కలాపం 2' 'ఆహా' లో వచ్చేది అప్పుడే..


‘భామా కలాపం 2’ సినిమా విడుదలకు సంబంధించి అప్ డేట్ కూడా రివీల్ చేసింది 'ఆహా' ఓటీటీ సంస్థ. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16న తమ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నట్లు  ప్రకటించింది. మొదట్లో ఈ సీక్వెల్ ని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. మళ్ళీ ఏమైందో తెలీదు 'ఆహా' ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇందులో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఆహా’ ఓటీటీ సంస్థతో కలిసి డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.


Also Read : 'విశ్వంభర' కోసం ‘మెగా’ వర్కవుట్స్ - చిరంజీవి డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా, ఈ వీడియో చూస్తే మీరు అదే అంటారు