Kalki 2898 AD Release Date: ‘బాహుబలి’ అనే సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు ప్రభాస్. కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్‌కు పాపులారిటీ దక్కింది. జపాన్ వంటి దేశాల్లో కూడా ఈ హీరోకు ఫ్యాన్స్ ఎక్కువయిపోయారు. ఇక ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ హాలీవుడ్ వరకు వెళ్లింది. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని ఏకంగా ఫారిన్ భాషల్లో కూడా విడుదల చేయడంతో ఈసారి ప్రభాస్ మెయిన్ టార్గెట్ హాలీవుడ్ అని అర్థమవుతోంది. ఈ సినిమాకు తగినంత క్రేజ్‌ను సంపాదించడం కోసం ఇప్పటికే అమెరికాలో ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది ‘కల్కి 2898 ఏడీ’. కానీ హాలీవుడ్ మేకర్స్ మాత్రం ఈ మూవీ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం.


హాలీవుడ్‌లో పోటీ..


‘కల్కి 2898 ఏడీ’ భారీ ఎత్తున తెరకెక్కుతోంది. బడ్జెట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా నిజంగానే హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. అంటే ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావాలంటే కచ్చితంగా ‘కల్కి 2898 ఏడీ’కి సోలో రిలీజ్ కావాల్సిందే. ఇక ఇండియన్ భాషల్లో ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఏ సినిమా కూడా దీనికి పోటీగా విడుదల అవ్వడానికి ముందుకు రాదు. కానీ హాలీవుడ్ మాత్రం ‘కల్కి 2898 ఏడీ’ మేకర్స్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేదని అర్థమవుతోంది. ఈ సినిమాకు పోటీగా ఒక భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతుండడంతో ‘కల్కి’ మేకర్స్‌లో ఆందోళన మొదలయ్యింది.


ఇండియన్ మూవీ మేకర్స్ సాయం..


మే 9న ‘కల్కి 2898 ఏడీ’ మూవి రిలీజ్‌కు సిద్ధమయ్యిందని. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. దీంతో మే 9 నుంచి కూడా పోస్ట్‌పోన్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం అవన్నీ రూమర్స్ అని, సినిమా చెప్పిన తేదీకే విడుదల అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ తేదీని పూర్తిగా ‘కల్కి’ కోసమే వదిలేశారు ఇండియన్ మూవీ మేకర్స్. కానీ హాలీవుడ్ మాత్రం దీనికి సిద్ధంగా లేదని అర్థమవుతోంది. మే 9న ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ చిత్రాన్ని విడుదల చేయాలని ఆ మూవీ మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. రెండు వారాల పాటు స్క్రీనింగ్ కోసం ఐమ్యాక్స్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ తరహాలోనే ‘కల్కి 2898 ఏడీ’ టీమ్ కూడా ఐమ్యాక్స్‌తో ఒప్పందం చేసుకోవడంతో అసలు సమస్య మొదలయ్యింది.


ఓవర్సీస్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్..


సినిమాల కలెక్షన్స్ విషయంలో ఐమ్యాక్స్‌తో పాటు ఇతర పెద్ద ఫార్మాట్ స్క్రీన్స్ కీలక పాత్రను పోషిస్తాయి. అందుకే ‘కల్కి 2898 ఏడీ’ ముందు నుండే ఐమ్యాక్స్‌తో కుదుర్చుకుంది. కానీ ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’ కూడా అదే స్ట్రాటజీ ఉపయోగించడంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. అమెరికా లాంటి దేశంలో ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స’తో పోటీ ‘కల్కి’ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ చూపిస్తుందని ఓవర్సీస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్‌కు చాలాకాలం తర్వాత ‘సలార్’తో ఊరట లభించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కాగా.. ‘సలార్’ మాత్రం హిట్ అందుకుంది. ఇప్పుడు వారి ఎదురుచూపులు అన్నీ ‘కల్కి’ కోసమే ఉన్నాయి.


Also Read: అలాంటి భర్త కావాలంటున్న 'యానిమల్' బ్యూటీ - పెళ్లి గురించి ఏం చెప్పిందంటే?