బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుఖ్ ఖాన్ నటిస్తున్న చిత్రం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలను సైతం నమోదు చేసింది. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుక్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే అతిధి పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ క్రమంలోనే ఇప్పటికే నార్త్ ఇండియా, ఓవర్సీస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ జవాన్ రికార్డ్ ఓపెనింగ్స్ ని సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే 'జవాన్' అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన కొన్ని గంటలకే ఈ మూవీ హిందీ వర్షన్ ఇప్పటికే 50% ఆక్యుఫెన్సీతో ఏకంగా రూ.70 లక్షల గ్రాస్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసింది. ఇక ఈ బాలీవుడ్ మూవీకి తెలుగులో కూడా భారీ అంచనాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ 'జవాన్' కి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా జవాన్ హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.


అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా డిజిటల్, సాటిలైట్ మరియు మ్యూజిక్ రైట్స్ తో సహా రూ.250 కోట్ల బిజినెస్ చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందిమ్ అంతేకాదు అన్ని ఏరియాల్లో థియేటర్స్ లో రికార్డ్ బిజినెస్ చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'జవాన్' మూవీ అవుట్ ఫుట్ తో పాటూ కలెక్షన్స్ వైపు మళ్ళింది. 'జవాన్' కంటే ముందు షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసింది. కాబట్టి 'జవాన్' సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా ఆ మార్క్ ని చేరుకోగలదని దాంతోపాటు బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా 'జవాన్' నిలుస్తుందని బాలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.


మరోవైపు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినచోట 'జవాన్' టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక్కో టికెట్ భారీ రేటు పలుకుతోందట. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా వంటి నగరాల్లో జవాన్ టికెట్ రేట్లు వేలలో ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో ఒక్కో టికెట్‌ ధర రూ.2,300 నుండి రూ.2.400 వరకు అమ్ముతున్నారట. దీన్నిబట్టి షారుక్ 'జవాన్' కి మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ దాటే అవకాశం ఉందని చెప్పొచ్చు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుక్ భార్య గౌరీ ఖాన్ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, సాన్య మల్హోత్రా, యోగి బాబు, సునీల్ గ్రోవర్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు .


Also Read : ఎంట్రీతోనే అదరగొట్టేసిన లేడీ సూపర్ స్టార్ - ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార సరికొత్త రికార్డ్




Join Us on Telegram: https://t.me/abpdesamofficial