కోలీవుడ్ అగ్ర హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు నయనతార కు సంబంధించిన విశేషాలను, అప్డేట్స్ ని ఆమె భర్త విగ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకునేవారు. కానీ పై తన విషయాలను నయన్ స్వయంగా అభిమానులతో పంచుకునేందుకు ఆమె సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన నయన్ ఫస్ట్ పోస్ట్ తోనే నెటిజన్స్ ని ఎంతో అట్రాక్ట్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాలో తన కవల పిల్లలతో ఉన్న ఓ వీడియోని షేర్ చేసింది.


తాను కథానాయకగా నటించిన జైలర్' సినిమాలోని హుకుం పాట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో తన ఇద్దరు కొడుకులను ఎత్తుకొని మాస్ లెవెల్ లో ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నయన్ ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది గంటలకే ఆమెకు ఫాలోవర్స్ భారీ సంఖ్యలో పెరుగుతూనే ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అలా ఓపెన్ చేసిందో లేదో వెంటనే లక్షల మంది ఫాలోవర్స్ చేరిపోయారు. ఆమె పెట్టిన రీల్ కి లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే నయన్ పర్సనల్ రీల్ కి రెండు లక్షల పైగా మంది లైక్ చేశారు.


ఇప్పుడు ఏకంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సాధించి ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది నయనతార. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఇన్‌స్టాగ్రామ్ లో అత్యంత వేగంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిన హీరోయిన్‌గా నయనతార నిలిచింది. ఇంతకుముందు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఈ రికార్డుని క్రియేట్ చేసింది. 24 గంటల్లో అత్యంత వేగంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న హీరోయిన్‌గా అప్పుడు కత్రినా కైఫ్ రికార్డ్ క్రియేట్ చేస్తే నయన్ మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసి అత్యంత వేగంగా వన్ మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది.


ఇన్నాళ్లు తన ప్రైవేట్ లైఫ్ ని బయట ప్రపంచానికి తెలియకూడదని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి దూరమైన నయనతార ఇప్పుడు అభిమానుల కోసం సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఆటోమేటిక్ గా రికార్డులన్నీ బద్దలైపోయాయి. దీన్నిబట్టి ఆడియన్స్ లో నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని స్పష్టం అవుతుంది. కాగా నయనతార ఇన్‌స్టాగ్రామ్ లో ఐదుగురిని మాత్రమే ఫాలో అవుతోంది.


అందులో తన భర్త విగ్నేష్, హీరో షారుఖ్ ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, మిషెల్లీ ఒబామా తో పాటు తన సొంత ప్రొడక్షన్ హౌస్ 'ది రౌడీ పిక్చర్స్' ఉన్నాయి. షారుక్ ఖాన్ సరసన నయనతార నటించిన 'జవాన్' మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మూవీ తమిళం తో పాటు హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.


Also Read : షారుఖ్ ఖాన్ తెలుగులో మాట్లాడటం చూశారా? - నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial