యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌ కథానాయకులుగా... ప్రియాంక రేవ్రి కథానాయికగా నటించిన సినిమా 'ప్రేమదేశపు యువరాణి' (Prema Deshapu Yuvarani). సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించారు. ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మాతలు. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2 మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలపై రూపొందుతోంది. సెప్టెంబర్ 2న (ఈ శనివారం) సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. హీరో అరవింద్‌ కృష్ణ, హాస్యనటుడు - మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 


నేను పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్! - సాయి సునీల్ నిమ్మల
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు తాను వీరాభిమానిని అని 'ప్రేమ దేశపు యువరాణి' దర్శకుడు సాయి సునీల్‌ నిమ్మల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఎంతో కష్టపడిన తర్వాత దర్శకుడిగా ఈ సినిమా చేసే అవకాశం  నాకు వచ్చింది. బ్లాక్‌ బస్టర్‌ అయిందా? లేదా? అనేది నాకు ముఖ్యం కాదు.. మా నిర్మాతలకు డబ్బులు వస్తే అదే పెద్ద విజయంగా భావిస్తా. పవన్‌ కళ్యాణ్ గారిపై  అభిమానంతో ఆయన పుట్టినరోజున (Pawan Birthday) సినిమాను విడుదల చేస్తున్నాం'' అని తెలిపారు.


Also Read : 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'!



ఆ ట్విస్ట్ తెరపై చూడాలి - అరవింద్ కృష్ణ 
'ప్రేమ దేశపు యువరాణి' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ ''నేను, యామిన్‌ రాజ్‌ కలిసి ఓ సిరీస్‌ చేశాం. అతనిలో చక్కటి ప్రతిభ ఉంది. ఈ సినిమాలోనూ చక్కగా నటించి ఉంటాడని నమ్ముతున్నా. నాకు ఈ సినిమా టైటిల్‌, ట్రైలర్‌ నచ్చాయి. ట్రైలర్ చూసిన తర్వాత 'ప్రేమ దేశపు యువరాణి' టైటిల్ కు సంబంధం లేదని అనిపించింది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఆ ట్విస్ట్‌ ఏంటి? అనేది తెరపై చూస్తే తెలుస్తుంది. నేను సినిమాలో కొన్ని సీన్లు చూశా. చాలా థ్రిల్ ఫీల్ అయ్యా. దర్శకుడు సాయి సునీల్ నిమ్మలతో భవిష్యత్తులో సినిమా చేయాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు. అజయ్‌ పట్నాయక్‌ సంగీతంలో ఆర్పీ పట్నాయక్‌, సునీత పాడిన పాటలు తనకు నచ్చాయని చెప్పారు. సినిమా విజయం సాధించాలని శివారెడ్డి ఆకాంక్షించారు. వ్యాపారం చేయాలని హైదరాబాద్ వచ్చిన తనకు హీరోగా అవకాశం వచ్చిందని యామిన్‌ రాజ్‌ తెలిపారు. 


Also Read 'ఖుషి' రివ్యూ : విజయ్ దేవరకొండ, సమంత జోడీ హిట్టు, మరి సినిమా?  


'ప్రేమదేశపు యువరాణి' సినిమాలో మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీ నాయుడు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కూర్పు : ఎంఆర్‌ వర్మ, పాటలు : కాసర్ల శ్యామ్‌ - సాయి సునీల్‌ నిమ్మల - భాను - కృష్ణ, నృత్య దర్శకత్వం : కపిల్‌ - శ్రీ వీర్‌, ఛాయాగ్రహణం : శివకుమార్‌ దేవరకొండ, సంగీతం : అజయ్‌ పట్నాయక్‌, నిర్మాతలు : ఆనంద్‌ వేమూరి - హరిప్రసాద్‌ సిహెచ్‌, రచన - దర్శకత్వం :  సాయి సునీల్‌ నిమ్మల.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial