మలయాళ హీరో, తెలుగు సినిమాల్లో నటించిన షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) డ్రగ్స్ తీసుకున్నాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని నటి విన్సీ చేసిన ఫిర్యాదు నేషనల్ వైడ్ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యేలా చేసింది. అతని మీద డ్రగ్స్ ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. కానీ, విన్సీ ఫిర్యాదు... అంతకు ముందు హేమ కమిటీ రిపోర్ట్ వంటివి మలయాళ సినిమా ఇండస్ట్రీ ప్రతిష్టను దెబ్బ తీశాయని చెప్పాలి. ఇక మలయాళ నిర్మాత, నటి సాండ్రా థామస్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి మాలీవుడ్ ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. 

Continues below advertisement


డ్రగ్స్ కోసం సపరేట్ బడ్జెట్... రూమ్స్ కూడా!
కేరళ సినీ వర్కర్స్ హంగర్ స్ట్రైక్, హేమ కమిటీ రిపోర్టు మీద తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వెల్లడించిన తర్వాత సాండ్రా థామస్ వార్తల్లో నిలిచారు.  గత ఏడాది ఆమెను నిర్మాతల సంఘం నుంచి సస్పెండ్ చేశారు. ఈసారి డ్రగ్స్ కోసం మలయాళ సినిమా ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు సపరేట్ బడ్జెట్ పెడుతున్నారని, రూమ్స్ కూడా సెట్ చేస్తున్నారని చెప్పడంతో మరోసారి సాండ్రా థామస్ వార్తల్లోకి వచ్చారు. అసలు ఈవిడ ఎవరు? ఏం చేశారు? అనే వివరాల్లోకి వెళితే...


నటిగా 1991లో సాండ్రా థామస్ కెరీర్ స్టార్ట్ చేశారు. 'నెట్టిపట్టం'లో ఆవిడ క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత 'మిమిక్స్ పరేడ్', 'ఒలింపియన్ అంటోనీ ఆడమ్' వంటి సినిమాల్లో నటించారు. 'ఫ్రైడే' సినిమాతో నిర్మాతగా మారారు. మోహన్ లాల్ హీరోగా నటించిన 'పెరుచాజీ' మూవీ కూడా ప్రొడ్యూస్ చేశారు. మలయాళంలో ఒక మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ''మలయాళ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం మీద దృష్టి సారించాలి.‌ చిత్రీకరణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు కానీ ఎవరు చర్యలు తీసుకోవడం లేదు. భవిష్యత్తులో తమ చేయబోయే సినిమాల కోసం డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు కావాలి కనుక ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు డ్రగ్స్ కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. డ్రగ్స్ వాడకానికి సపరేట్ రూమ్స్ కేటాయిస్తున్నారు'' అని చెప్పారు.


Also Read: సిమ్రాన్‌కు సారీ చెప్పిన జ్యోతిక... లేటెస్ట్ ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్!


నాలుగైదు సినిమాలు చేస్తున్నా...
ఎవరేం చేస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది?
మలయాళ నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ లేటెస్ట్ స్టేట్మెంట్‌ను సాండ్రా థామస్ తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న 'బేబీ గర్ల్ సినిమా చిత్రీకరణలో డ్రగ్స్ వాడుతున్నారనే ఆరోపణలు వచ్చాయని, ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ తన రూమ్‌లో గంజాయి తీసుకుంటూ దొరికాడని పేర్కొన్నారు. అయితే సదరు ఆరోపణలపై నిర్మాత స్పందించారు. ''నేను ఒకేసారి మూడు నాలుగు సినిమాలు తీస్తుంటాను. అందువల్ల ఎవరు ఏ సెట్‌కు ఏం తీసుకొస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది. డ్రగ్స్ వాడుతున్న వాళ్లను సస్పెండ్ చేయడం బెస్ట్'' అని లిస్టిన్ స్టీఫెన్ తెలిపారు. ఆయన కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ట్రెజరర్. అలాగే, కేరళ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇండస్ట్రీ మీద కంట్రోల్ కోసం బ్లాక్ మనీని తెస్తున్నాడని కూడా సాండ్రా థామస్ ఆరోపణలు చేశారు.


Also Readహీరోలను డామినేట్ చేసిన కియారా బికినీ... ట్విట్టర్‌లో ఆ పోస్టులు, ఫాలోయింగ్ చూస్తే మాస్ మెంటల్