Nandamuri Kalyan Ram's Arjun Son Of Vyajayanthi OTT Streaming On Aha: నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'. ఏప్రిల్ 18న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్' వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీలోనూ రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా'లోనూ (Aha) స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 (శుక్రవారం) నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఓ పోలీస్ అధికారి కొడుకు తానే చట్టంగా మారినప్పుడు ఏం జరుగుతుంది. న్యాయం, తిరుగుబాటు, రక్త సంబంధాలు ఉత్కంఠబరిత స్టోరీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు ఈ మూవీని నిర్మించగా.. ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. తల్లీకొడుకులుగా నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి తమ నటనతో మెప్పించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో విజయశాంతి అదరగొట్టారు. కల్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. మూవీలో సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ ఫేం పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు.

Also Read: 'షుగర్ బేబీ' అందాలు చూశారా? - కమల్ హాసన్ 'థగ్ లైఫ్' నుంచి సాంగ్ రిలీజ్

స్టోరీ ఏంటంటే? 

తన డ్యూటీలో రాజీ పడని ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయశాంతి). తనలాగే తన కొడుకు అర్జున్ (నందమూరి కల్యాణ్ రామ్) కూడా ఐపీఎస్ ఆఫీసర్ కావాలని కలలు కంటుంది. ఆమె కల నెరవేర్చేందుకు అర్జున్ కూడా తీవ్రంగా శ్రమిస్తాడు. అనుకున్నట్లుగానే సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ఆరో ర్యాంక్ సాధిస్తాడు. అయితే, అనుకోని రీతిలో అతని తండ్రి మరణించడంతో అర్జున్ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. తన తండ్రి మరణం తర్వాత జరిగిన పరిణామాలతో పోలీస్ ఆఫీసర్ కావాల్సిన అర్జున్ గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. తన కనుసైగలతో విశాఖను శాసించే స్థాయికి ఎదుగుతాడు.

అర్జున్ ఎన్ని మర్డర్స్ చేసినా అతనిపై ఒక్క కంప్లైంట్ కూడా ఉండదు. అయితే.. అర్జున్ ఇలా మారడాన్ని తట్టుకోలేని వైజయంతి అతన్ని దూరం పెడుతుంది. ఇదే సమయంలో కరుడుగట్టిన ఉగ్రవాది నుంచి తన తల్లికి ప్రాణహాని ఉందని అర్జున్ తెలుసుకుంటాడు అర్జున్. దీంతో అతను ఏం చేశాడు?, అతని తండ్రి మరణానికి గల కారణాలేంటి?, గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడు?, ఉగ్రవాది నుంచి తన తల్లిని ఎలా కాపాడుకున్నాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.