'వార్ 2' టీజర్ విడుదలైంది. ఎన్టీఆర్ (NTR) లుక్స్ బాగున్నాయని ఫాన్స్ ఫుల్ హ్యాపీ. హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెన్స్ ఎన్టీఆర్‌ను డామినేట్ చేసిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. టీజర్‌లో విఎఫ్ఎక్స్ వర్క్ మీద విమర్శలు చేసే ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య కొన్ని విషయాలలో డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ యునానిమస్‌గా అందరూ యాక్సెప్ట్ చేసే విషయం 'వార్ 2' టీజర్‌లో ఒక్కటి ఉంది... అది కియారా అద్వానీ బికినీ (Kiara Advani War 2 Bikini).
హీరోలను డామినేట్ చేసిన గ్లామర్!'వార్ 2' టీజర్, అందులో విఎఫ్ఎక్స్ కథ, ఆల్రెడీ వచ్చిన 'వార్' సినిమాలో షాట్స్‌తో కంపారిజన్... వీటన్నింటిన పక్కన పెడితే బికినీలో కియారా అద్వానీ కనిపించేది కాసేపే అయినప్పటికీ ఆమె గ్లామర్ హీరోల ఇద్దరి యాక్షన్ సన్నివేశాలను సైతం డామినేట్ చేసిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందులో డిస్కషన్లకు తావు లేదు.
అందరి నోటా ఒక్కటే మాట... కియారా అద్వానీ గ్లామర్ సూపర్ అని. బికినీలో ఆవిడ కనిపించిన షాట్స్ చాలామందిని ఎట్రాక్ట్ చేశాయి. కియారా అద్వానీ కోసమే సినిమా చూడాలని అనుకుంటున్నట్టు చాలా మంది పోస్టులు చేస్తున్నారు.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు