సిమ్రాన్, జ్యోతిక... అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఇద్దరూ సూపర్ హిట్ సినిమాలు చేశారు. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు కమర్షియల్ సినిమాలలో కథానాయికగా నటించిన సిమ్రాన్ ఇటీవల కొన్ని సినిమాలలో విలన్ రోల్స్ చేశారు. అలాగే రెగ్యులర్ రోల్స్ కూడా చేశారు. జ్యోతిక అయితే డిఫరెంట్ ఫిలిమ్స్, కంటెంట్ ఓరియంటెడ్ ఫిమేల్ పిక్చర్స్ చేస్తున్నారు. హిందీలో 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్ చేశారు. అప్పుడు సిమ్రాన్ జ్యోతిక మధ్య జరిగిన వాట్సాప్ కన్వర్జేషన్ ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది.

డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్!తమిళంలో సిమ్రాన్, జ్యోతిక హీరోయిన్లగా నటించిన సినిమాలు ఉన్నాయి. ఆయా సినిమాలలో సూపర్ హిట్లు ఉన్నాయి. మరి ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య గొడవ ఏమిటి అనే విషయంలోకి వెళితే? 

తమిళనాడు జరిగిన ఒక అవార్డు వేడుకలో సిమ్రాన్... ''ఇటీవల నేను ఒక సహ నటికి మెసేజ్ చేశా. తనను అటువంటి క్యారెక్టర్‌లో చూసి సర్‌ప్రైజ్ అయ్యానని చెబితే... ఆంటీ రోల్స్ చేయడం కంటే అటువంటి క్యారెక్టర్లు చేయడం బెటర్ అని రిప్లై వచ్చింది. డబ్బా రోల్స్ చేయడం కంటే ఆంటీగా నటించడం బెటర్'' అని ఘాటుగా, కాస్త కోపంగా చెప్పుకొచ్చారు. జ్యోతిక పేరును సిమ్రాన్ ప్రస్తావించలేదు. కానీ, డబ్బా రోల్స్ అనడంతో అందరూ జ్యోతికను సిమ్రాన్ టార్గెట్ చేసిందని భావించారు. ఒక సమయంలో లైలా పేరు కూడా తెరపైకి వచ్చింది. సిమ్రాన్, లైలా కలిసి ఇటీవల 'శబ్దం' అనే సినిమా చేశారు. అందువల్ల కోస్టార్ అంటే లైలా ఏమో అని అనుమానం వచ్చినప్పటికీ డబ్బా రోల్స్ అని సిమ్రాన్ చెప్పడంతో జ్యోతికను అన్నారని అర్థమైంది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ కామెంట్స్ చేసిన తర్వాత ఏం జరిగిందో సిమ్రాన్ వివరించారు.

Also Read: హీరోలను డామినేట్ చేసిన కియారా బికినీ... ట్విట్టర్‌లో ఆ పోస్టులు, ఫాలోయింగ్ చూస్తే మాస్ మెంటల్

నేను ఎవరిని అన్నారో వాళ్ళు సారీ చెప్పారు!తన కామెంట్స్ వైరల్ కావడం గురించి సిమ్రాన్ మాట్లాడుతూ... ''డబ్బా కార్టెల్ మంచి వెబ్ సిరీస్. అయితే ప్రేక్షకులు మీడియా తమకు తోచిన విధంగా నేను ఏమన్నాననేది బ్రేకింగ్ న్యూస్ చేశారు. నేను ఎవరిని ఉద్దేశించి అన్నానో వాళ్ళ దగ్గరకు ఆ కామెంట్స్ చేరాయి. ఆ వ్యక్తి నాకు సారీ చెబుతూ మెసేజ్ చేశారు. నన్ను హార్ట్ చేయాలనే ఉద్దేశం తనకు లేదని వివరించారు'' అని సిమ్రాన్ తెలిపారు అది సంగతి. దాంతో జ్యోతిక, సిమ్రాన్ మధ్య వివాదం ముగిసినట్టేనని అనుకోవాలి.

Also Readమ్యాన్ ఆఫ్ మాసెస్ కిల్లర్ లుక్స్... ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్ ఫేస్ ఆఫ్... బికినిలో కియారా అడ్వాణీ గ్లామర్... పంచభూతాల కాన్సెప్ట్ ఫైట్స్ - 'వార్ 2' టీజర్‌లో వీటిని గమనించారా?