Kajal Aggarwal's action movie Satyabhama teaser review : తెలుగు ప్రేక్షకులు చందమామ అని ముద్దుగా పిలిచే అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్. ఇకపై ఆవిడ చందమామ కాదు... యాక్షన్ భామ అని చెప్పాలి! కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'సత్యభామ'. దీపావళి కానుకగా ఈ రోజు టీజర్ విడుదల చేశారు. అందులో కాజల్ యాక్షన్ ఇరగదీశారు. 


కాజల్ యాక్షన్ చేస్తే... విలన్లను చిత్తకొడితే? 
'సత్యభామ' సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. అయితే... ఖాకీ డ్రస్ వేసుకుని కాజల్ ఏం చేశారు? ఆమెకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది ఈ రోజు విడుదల చేసిన టీజర్ చూస్తే ఓ ఐడియా వస్తుంది.


హత్యకు గురైన అమ్మాయి ప్రాణాలు కాపాడాలని సత్యభామ (కాజల్) ట్రై చేస్తుంది. కానీ, ఆ అమ్మాయి బతకదు. అప్పుడు ఆ కేసును సత్యభామ నుంచి మరొకరికి బదిలీ చేస్తారు. 'ఈ కేసు నీ చేతుల్లో లేదు' అని పోలీస్ ఉన్నతాధికారి ప్రకాష్ రాజ్ చెబుతారు. తన చేతుల్లో ఓ యువతి ప్రాణాలు పోయాయని, అప్పటి నుంచి ఆ గిల్ట్ ఫీలింగ్‌తో సత్యభామ బాధ పడుతుంది. అమాయకపు యువతి ప్రాణాలు తీసిన హంతకులు కోసం వేట మొదలు పెడుతుంది. తన దారికి అడ్డు వచ్చిన విలన్లను  చిత్తకొడుతుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం కూడా బావుంది. షీరోయిజం ఎలివేట్ చేసింది. వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 


Also Read : జపాన్ రివ్యూ : వాటీజ్ థిస్ కార్తీ - స్లాంగ్ బావుంది సార్, మరి సినిమా?



కాజల్ ఇంతకు ముందు విజయ్ 'జిల్లా'లో పోలీస్ రోల్ చేశారు. అయితే... అందులో హీరోతో పాటు రొమాంటిక్ సీన్లు, పాటలకు మాత్రమే ఆ పాత్ర పరిమితమైంది. ఫస్ట్ టైమ్ కాజల్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తున్నది 'సత్యభామ'లోనే! ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. హంతకులను కాజల్ ఎలా పట్టుకున్నారు? అనేది సినిమాలో చూడాలి. 


నిర్మాతగా మారిన 'మేజర్' & 'గూఢచారి' దర్శకుడు
'సత్యభామ' సినిమాతో దర్శకుడు శశికిరణ్ తిక్క చిత్ర నిర్మాణంలో అడుగు పెట్టారు. అడివి శేష్ హీరోగా నటించిన 'మేజర్', 'గూఢచారి' సినిమాలతో ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. విజయాలు అందుకున్నారు. 'సత్యభామ'కు ఆయన చిత్ర సమర్పకులు. అంతే కాదు... స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. 


Also Read : ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ రివ్యూ: రాఘవ లారెన్స్, ఎస్‌జే సూర్య ఎలా చేశారు? కార్తీక్ సుబ్బరాజ్ ఎలా తీశారు?



కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ : అవురమ్ ఆర్ట్స్, కథనం & చిత్ర సమర్పణ : శశి కిరణ్ తిక్క, నిర్మాతలు : బాబీ తిక్క - శ్రీనివాసరావు తక్కలపెల్లి, సహ నిర్మాత : బాలాజీ, ఛాయాగ్రహణం : జి విష్ణు, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: సుమన్ చిక్కాల