సెన్సేషనల్ హీరో, రౌడీ బాడీ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), సమంత రూత్ ప్రభు (Samantha) జంటగా చిత్రం 'ఖుషి' (Kushi Movie). శివ నిర్వాణ (Shiva Nirvana) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...
సరిగమ చేతికి 'ఖుషి' ఆడియో రైట్స్!
'ఖుషి'కి హేషామ్ అబ్దుల్ వాహాబ్ (Hesham Abdul Wahab) సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో ఆయనకు మంచి పేరు ఉంది. సూపర్ హిట్ 'హృదయం' పాటలకు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. 'ఖుషి'కి ఆయన సంగీతం అందిస్తున్నారని తెలిసినప్పటి నుంచి... క్రేజ్ నెలకొంది. దానికి తోడు 'ఖుషి' టైటిల్, విజయ్ దేవరకొండ స్టార్ డమ్ తోడు కావడంతో ఇంకా ఒక్క పాట కూడా విడుదల కాకుండా ఫ్యాన్సీ రేటుకు సినిమా ఆడియో రైట్స్ సరిగమ కంపెనీ సొంతం చేసుకుంది.
సెప్టెంబర్ 1న 'ఖుషి'
Kushi Release Date : సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట.
'ఖుషి'లో ఐటీ ఉద్యోగిగా సమంత!
సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' గుర్తుకు వస్తోంది.
Also Read : రజనీకాంత్ 100% కరెక్ట్, నిజాలే మాట్లాడతారు - వైసీపీలో ఇష్యూలో జగపతి బాబు మద్దతు
'ఏ మాయ చేసావె'లో సమంత ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో ఉద్యోగిగా కనిపించారు. అయితే, 'ఏ మాయ చేసావె' తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి పాత్ర చేయడం 'ఖుషి'లోనే అనుకుంట! అందులోనూ సినిమాలోని కొత్త స్టిల్ చూస్తే... 'ఏ మాయ చేసావె'లో నడిచినట్టే ఉంది. అందులో చీర అయితే, 'ఖుషి'లో చుడిదార్! అదీ సంగతి! ఆ మధ్య హైదరాబాద్, దుర్గం చెరువు సమీపంలోని ఐటీ కంపెనీలలో విజయ్ దేవరకొండ, సమంత మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు.
Also Read : జీవితానికి సరిపడా జ్ఞాపకాలు, చివరి శ్వాస వరకు ప్రేమిస్తుంటా - తారకరత్న భార్య అలేఖ్య
'ఖుషి' సంగతి పక్కన పెడితే... ఈ సినిమా తర్వాత 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయనున్నారు. అందులో శ్రీలీల కథానాయిక. మే 3 (బుధవారం) ఆ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
'ఖుషి' చిత్రంలో మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హేషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.