Animal Runtime : 'యానిమల్'(Animal) మూవీతో బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor) ని ఊర మాస్ క్యారెక్టర్‌లో మోస్ట్ వైలెంట్ హీరోగా ఉత్తరాది ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే 'యానిమల్'పై ఈ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. రీసెంట్‌గా విడుదలైన టీజర్ ఆడియన్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. నవంబర్ 23న ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.


'అర్జున్ రెడ్డి'(Arjun Reddy) మూవీని 'కబీర్ సింగ్'(Kabir Singh) పేరుతో హిందీలో రీమేక్ చేసి భారీ సక్సెస్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నారు. మరీ ముఖ్యంగా 'యానిమల్' రన్ టైం గురించి గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఏ సినిమాకి లేని రన్ టైం 'యానిమల్' మూవీకి ఉండబోతుందని, ఏకంగా మూడున్నర గంటల రన్ టైం తో మూవీ ఉంటుందని కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఆ వార్తలే నిజమయ్యాయి. 'యానిమల్' మూవీ రన్ టైం గురించి స్వయంగా సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చాడు.


ఈ మధ్యకాలంలోనే కాదు కొన్ని సంవత్సరాలుగా మరే సినిమాకి రాని షాకింగ్ రన్ టైం తో 'యానిమల్' రిలీజ్ కాబోతోంది. 'యానిమల్' మూవీ ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్ల నిడవి, 16 ప్రేమ్స్ తో రాబోతుందని సందీప్ వంగా వెల్లడించాడు. అంతేకాకుండా గతంలో కబీర్ సింగ్ సినిమాకి వచ్చినట్టుగానే 'యానిమల్'కి కూడా 'A' సర్టిఫికెట్ వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీలోనే 'A' సర్టిఫికెట్‌తో రూ.300 కోట్ల గ్రాస్ అందుకున్న సినిమా రాలేదు. సందీప్ వంగా తెరకెక్కించిన 'కబీర్ సింగ్' మూవీకే ఆ ఘనత దక్కింది. ఇప్పుడు అదే 'A' సర్టిఫికెట్‌తో రాబోతున్న 'యానిమల్' మూవీతో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగా.


ఈ ఏడాది ఆరంభంలో 'పఠాన్', 'జవాన్', 'గదర్ 2' వంటి సినిమాలు బాలీవుడ్‌కు ఊపిరి పోశాయి. ఈ సినిమాలతో ఇండస్ట్రీ మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే ఏడాది ఎండింగ్ 'యానిమాల్' రూపంలో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ రణబీర్ తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.


Also Read : అంతమంది డ్యాన్సర్లతో 'దేవర' సాంగ్? ఎన్టీఆర్‌తో మరోసారి ఆ కొరియోగ్రాఫర్!