Madhavan, Juhi Chawla: కోలీవుడ్ అగ్ర హీరో మాధవన్(Madhavan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చేనాటికే ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉండేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ విషయాన్ని తన తల్లికి కూడా చెప్పానని అన్నాడు మాధవన్. ఇంతకీ ఈ తమిళ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? మాధవన్ తాజాగా' ది రైల్వే మెన్'(The Railway Men) అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా(Juhi Chawla) ఓ కీలక పాత్ర పోషించింది.


తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. "అదృష్టం బాగుండి ఈ సిరీస్ కి జూహీ చావ్లా ఓకే చెప్పారు. ఇక్కడ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. 'ఖయామత్ సే ఖయామత్ తక్' (Qayamat Se Qayamat Tak) సినిమా చూసినప్పుడు నేను ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పాను. అప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లి చేసుకోవడమే" అని అన్నాడు. అంతేకాకుండా 'రైల్వే మెన్' (Railway Men) సిరీస్ లో జుహీ చావ్లా(Juhi Chawla)తో కలిసి పనిచేసే అవకాశం తనకు రాలేదని, ఎందుకంటే తన భాగానికి సంబంధించిన షూట్ అయిపోయిన తర్వాతే జూహి చావ్లా ఈ సిరీస్ లో భాగం అయ్యారని ఈ సందర్భంగా తెలిపాడు మాధవన్.


కాగా 1988లో 'ఖయామత్ సే ఖయామత్ తక్' (Qayamat Se Qayamat Tak) సినిమా రిలీజ్ అయింది. అప్పటికీ మాధవన్ తన సినీ కెరీర్ ని ప్రారంభించనేలేదు. 1993లో 'బనేగి అప్ని బాత్' (Banegi Apni Baat) టీవీ షో ద్వారా మాధవన్ తొలిసారి స్క్రీన్ పై కనిపించాడు. ఆ తర్వాత కొన్ని టీవీ షోస్‌లో చేశాడు. 1997లో 'ఇన్ ఫెర్నో' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ భాషల్లో నటించి వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1999లో సరిత బిర్జీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాధవన్ నటించిన పలు సినిమాలకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం విశేషం.


ఇక 'ది రైల్వే మెన్ (The Railway Men) వెబ్ సిరీస్ విషయానికొస్తే.. 1984 భోపాల్లో జరిగిన గ్యాస్ లీక్ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఆయుష్ గుప్తా రచించిన ఈ సిరీస్ ని శివ్ రావైల్ డైరెక్ట్ చేశారు.. మాధవన్, బాబిల్ ఖాన్, కేకే మీనన్, దివేందు శర్మ  తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. YRF ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్(Netflix)లో నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం నాలుగు ఎపిసోడ్స్ కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది.


Also Read : త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు, మన్సూర్ అలీపై లైంగిక వేధింపుల కేసు నమోదు