Devara Song Update :' ఆచార్య'(Acharya) వంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ 'దేవర'(Devara) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కాస్ట్ అండ్ క్రూ దగ్గర నుంచి మొదలుపెడితే యాక్షన్ సీక్వెన్స్ లు, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చేలా చూసుకుంటున్నాడు. 'జనతా గ్యారేజ్' వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న 'దేవర' పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమాని గ్రాండ్ స్కేల్ లో తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దింపిన కొరటాల ఇప్పుడు ఓ భారీ సాంగ్ ని స్టార్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల RRR మూవీలో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో వచ్చిన 'నాటు నాటు' సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ పాటలో తారక్, చరణ్ మాస్ స్టెప్స్ కి సినీ లవర్స్ అంతా ఫిదా అయిపోయారు. ఏకంగా హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ సాంగ్ ని ఎంతో ఎంజాయ్ చేశారు. అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాటకి ఏకంగా ఆస్కార్ కూడా వచ్చింది. ఇక ఈ పాటతో కొరియోగ్రాఫర్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇప్పుడు 'దేవర' సినిమాలో సుమారు 2000 మంది డాన్సర్స్ తో అదిరిపోయే సాంగ్ ని ప్లాన్ చేశారట. పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీ గ్రాండ్ స్కేల్ ని ప్రతిబింబించేలా ఈ పాటని ప్రేమ్ రక్షిత్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందుకోసం భారీ సెట్ కూడా రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్ ఉండబోతోంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో, రెండువేల మంది డాన్సర్స్ తో సాంగ్ అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. రీసెంట్ గా కంప్లీట్ అయిన గోవా షెడ్యూల్లో ఎన్టీఆర్, జాన్వి కపూర్ లపై రొమాంటిక్ సాంగ్ ని మూవీ టీం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఎన్టీఆర్ తో పాటు పలువురు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ చిత్రంతో తెలుగు వెండితెరకు హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నారు. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ కూడా అతిధి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రత్న వేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.
Also Read : జుహీ చావ్లాని పెళ్లి చేసుకోవడమే లక్ష్యం, అమ్మకి కూడా చెప్పా: మాధవన్