సల్మాన్ ఖాన్... బాలీవుడ్ బాక్సాఫీస్ మెషిన్ గన్! వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. సల్మాన్ మినిమమ్ గ్యారంటీ హీరో. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ... కోట్లకు కోట్లు కలెక్షన్స్ సాధించగల సత్తా ఉన్న హీరో. అటువంటి సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఓ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. రూ. 19 కోట్లు పెట్టి సినిమా తీస్తే... కేవలం 80 లక్షలు మాత్రమే వచ్చింది. ఇంతకీ, ఆ సినిమా ఏదో తెలుసా? ఆ ఫ్లాప్ దెబ్బకు దర్శకుడికి మరో సినిమా చేసే అవకాశం రాలేదు. హీరోయిన్ ఇంకో ఇండియన్ సినిమా చేయలేదు. పూర్తి వివరాల్లోకి వెళితే... 


సల్మాన్ నటించిన ఏకైక ఇంటర్నేషనల్ సినిమా...
బడ్జెట్ 19 కోట్లు - ఇండియాలో వచ్చింది 80 లక్షలు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ సినిమా 'మారిగోల్డ్'. అమెరికన్ ఫిల్మ్ మేకర్ విల్లార్డ్ కరోల్ తీశారు. క్రాస్ కల్చర్ రొమాంటిక్ సినిమాగా తెరకెక్కించారు. ఇండియా వచ్చిన అమెరికన్ నటి... ఇక్కడి హిందీ సినిమా ఇండస్ట్రీతో, ఇక్కడి వ్యక్తితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా.


Also Readపదేళ్ల తర్వాత హిందీ సినిమాలో రాశీ ఖన్నా - యాక్షన్ థ్రిల్లర్ లో శారీలో...
 
'మారిగోల్డ్' సినిమా 2007లో విడుదల అయ్యింది. ఎన్నో ఆశలు, అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే... ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎటువంటి ప్రభావం చూపించలేదు. సల్మాన్ కెరీర్ మొత్తం మీద భారీ డిజాస్టర్ అనిపించుకుంది. రూ. 19 కోట్లతో తీస్తే కేవలం రూ. 80 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇండియాలో వసూళ్లు కోటి దాటలేదు. అలాగని, అమెరికాలో పెద్దగా వసూలు చేసిందా? అంటే అదీ లేదు. అక్కడ కోటికి అటు ఇటుగా కలెక్ట్ చేసింది. 


'మారిగోల్డ్' దెబ్బకు దర్శకుడి కెరీర్ క్లోజ్!
'మారిగోల్డ్'కు ముందు విల్లార్డ్ కరోల్ మూడు సినిమాలు చేశారు. అయితే, ఆ సినిమా తర్వాత అతడికి మరో సినిమా రాలేదు. అతని కెరీర్‌లో భారీ సినిమా ఇది. లాస్ట్ ఫిల్మ్ కూడా ఇదే!






'మారిగోల్డ్'లో సల్మాన్ ఖాన్ సరసన అమెరికన్ నటి, 'రెసిడెంట్ ఈవిల్' ఫేమ్ అలీ లార్టర్ కథానాయికగా నటించారు. ఈ సినిమా తర్వాత ఇండియన్ దర్శక నిర్మాతల నుంచి తనకు బోలెడు ఆఫర్లు వస్తాయని ఆమె ఆశించారట. అయితే... ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. 'మారిగోల్డ్' తర్వాత మరో ఇండియన్ సినిమాలో అలీ లార్టర్ నటించలేదు. హాలీవుడ్ వెళ్లిపోయారు.


Also Readయువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?