Balakrishna New Movie: యువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?

Nandamuri Balakrishna New Movie 2024: కొత్తవాళ్లను ఎప్పుడూ ప్రోత్సహించే హీరో బాలకృష్ణ. ఇప్పుడు ఆయన ఓ యువ దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Continues below advertisement

తెలుగు చలన చిత్రసీమలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను దర్శకుల హీరో అంటారు. కథ నచ్చితే చాలు... కొత్త దర్శకులతో సినిమా చేయడానికి ఆయన రెడీ అంటారు. యువ దర్శకులతో పలు సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం. కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసిన అనుభవం ఉన్న దర్శకుడితో ఆయన సినిమా చేయనున్నారని టాక్. ఆ వివరాల్లోకి వెళితే... 

Continues below advertisement

'శ్యామ్ సింగ రాయ్' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో... 
నాని కథానాయకుడిగా, సాయి పల్లవి కథానాయికగా నటించిన పీరియాడిక్ సోషియో ఫాంటసీ ఫిల్మ్ 'శ్యామ్ సింగ రాయ్' గుర్తు ఉందా? ఆ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. దాని కంటే ముందు 'ది' విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన 'టాక్సీవాలా', ఆ చిత్రానికి ముందు 'ది ఎండ్' అని మరో సినిమా చేశారు. ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకంటే... 

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖబర్. ఫిల్మ్ నగర్ వర్గాల కథనం ప్రకారం... ఇటీవల బాలకృష్ణను కలిసి రాహుల్ సాంకృత్యాన్ ఓ స్టోరీ ఐడియా చెప్పారట. నందమూరి నాయకుడి కోసం పీరియడ్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఈ సినిమా చర్చల దశలో ఉంది. కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Also Readభ్రమయుగం రివ్యూ: మమ్ముట్టి నటన టాప్ క్లాస్... మరి సినిమా? లేటెస్ట్ మలయాళీ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

'వాల్తేరు  వీరయ్య' దర్శకుడితో వీర సింహా రెడ్డి
Balakrishna Upcoming Movie: ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... లాస్ట్ ఇయర్ సంక్రాంతి హిట్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య' తీసిన దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)తో ఓ సినిమా చేస్తున్నారు. సంక్రాంతికి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సైతం విడుదల అయ్యింది. విజయం అందుకుంది. గత ఏడాది సంక్రాంతికి విజయం అందుకున్న హీరో, దర్శకుడు కలిసి సినిమా చేస్తుండటం విశేషం. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా చేస్తున్నారట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read: అమెరికాలో ఉంటూ ఇండియాలో సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు - 'ఇంద్రాణి' ట్రైలర్ లాంచ్‌లో అనిల్ సుంకర  

'వీర సింహా రెడ్డి' తర్వాత దర్శకుడు బాబీ మరో సినిమా చేయలేదు. మధ్యలో అనిల్ రావిపూడితో బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చేసి విజయం అందుకున్నారు. బాబీ సినిమా తర్వాత బాలకృష్ణ మరో సినిమాకు కమిట్ కాలేదు. బహుశా... రాహుల్ సాంకృత్యాన్ సినిమా ఓకే అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి విజయాలు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని కొన్ని రోజులుగా వినబడుతోంది. ఆ సినిమా కోసం నందమూరి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బోయపాటితో సినిమా చేస్తున్నట్లు గీతా ఆర్ట్స్ సంస్థ ఇటీవల అనౌన్స్ చేసింది. అందులో హీరో ఎవరు? అనేది వెల్లడించలేదు. మరి, ఆ సినిమాలో హీరో అల్లు అర్జునా? లేదంటే బాలకృష్ణనా? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.

Continues below advertisement