Sudheer Babu about Wife Priyadharshini: పెళ్లి తర్వాత సినీ పరిశ్రమలో తమ లక్ పరీక్షించుకోవాలి అనుకునే హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో సుధీర్ బాబు కూడా ఒకరు. మహేశ్ బాబు చెల్లెలు ప్రియదర్శినితో పెళ్లయిన తర్వాతే సుధీర్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంటర్ అయ్యాడు. మెల్లగా టాలీవుడ్ నుండి బాలీవుడ్‌కు కూడా వెళ్లాడు. అసలు తెలుగు హీరోల్లో ఎవరికీ సుధీర్ లాంటి పర్సనాలిటీ లేదని గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. సుధీర్, ప్రియదర్శినిలది ఎరేంజ్డ్ మ్యారేజ్. పైగా వీరిద్దరూ కలిసి ఎక్కువగా బయట కనిపించింది కూడా లేదు. అందుకే తాజాగా ప్రియదర్శిని అక్క మంజులా ఘట్టమనేని వీరిద్దరితో ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది.


లావుగా ఉంది అనుకున్నాను..


మంజులా ఘట్టమనేని విడుదల చేసిన వీడియోలో మొదటిసారి ప్రియదర్శినిని చూసినప్పుడు తను ఏమనుకున్నాడో బయటపెట్టాడు సుధీర్. ‘‘పెళ్లిచూపులుగా పెట్టారు. అందులోనే మొదటిసారి కలిశాను. ఆ ముందు రోజు పేపర్‌లో ఒక ఫోటో పడింది. అందులో తను చాలా లావుగా కనిపించింది. పెళ్లిచూపులకు వచ్చిన తర్వాత నేను కూర్చొని ఉన్నాను. ఆ తర్వాత తను కూడా వచ్చి కూర్చుంది. అప్పుడు నేను ఇంకా ఎవరైనా వస్తారా అని చూస్తున్నాను. తనే ప్రియ అనే మళ్లీ పేరు చెప్పారు. అంతకంటే ముందు పేపర్‌లో చూసి భయపడ్డాను. పెద్ద ఫ్యామిలీ అని చెప్పి పెళ్లిచూపులకు రమ్మంటుందా అని అమ్మతో అన్నాను. ఏంట్రా నువ్వు అసలు చూశావా? చూస్తే తెలుస్తుంది. చాలా బాగుంటుంది అని అమ్మ చెప్పింది’’ అంటూ తన పెళ్లిచూపులు సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు సుధీర్.






పెళ్లయిన తర్వాతే సినిమాల్లోకి..


పేపర్‌లో ఫోటో చూసి అపోహపడినా కూడా తర్వాత నేరుగా చూసి సర్‌ప్రైజ్ అయ్యానని ప్రియదర్శినిని మొదటిసారి చూసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు సుధీర్. మొదటిసారి చూసి లావుగా ఉంది అనుకున్నాను. ఆ ఫొటో చూసి భయపడ్డాను అని సుధీర్ చెప్తుండగానే.. మరీ లావుగా ఉంది అనుకున్నప్పుడు ఎందుకు వచ్చావు.. చూడడానికి అంటూ ఎదురుప్రశ్న వేసింది ప్రియదర్శిని. దానికి సుధీర్ స్పందిస్తూ.. ‘‘పెద్ద ఫ్యామిలీ కదా, పెళ్లి చూపులకు వచ్చి కాదంటే బాగుంటుందా? అని అన్నాను. చూడరా, చూసిన తర్వాత కదా నచ్చిందో లేదో చెప్పేది. నీకు నచ్చుతుందని మా పెద్దలు అన్నారు’’ అని సమాధానం ఇచ్చాడు. 2006లో సుధీర్, ప్రియదర్శినీలకు పెళ్లి జరిగింది. ఇక పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత.. అంటే 2010లో విడుదలయిన ‘ఏం మాయ చేశావే’ సినిమాలో హీరోయిన్ సమంతకు తమ్ముడి పాత్రలో కనిపించి మొదటిసారి ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత 2012లో ‘శివ మనసులో శృతి’ అనే సినిమాతో హీరోగా మారాడు.


చైల్డ్ ఆర్టిస్ట్‌గా కుమారుడి ఎంట్రీ..


సుధీర్, ప్రియదర్శినికి ఇద్దరు కుమారులు. అందులో పెద్ద కుమారుడు చరిత్ కూడా ఇప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో అడుగుపెట్టాడు. తన తండ్రి హీరోగా నటించిన పలు చిత్రాల్లో తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. తనకు పెద్దయ్యాక హీరో అవ్వాలనే కోరిక ఉందని సుధీర్ ఇప్పటికే రివీల్ చేశాడు. ఇక సుధీర్ బాబు సినిమాల విషయానికొస్తే.. తను చివరిగా ‘మామ మశ్చింద్ర’ అనే కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ‘హరోం హర’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంతో బిజీగా ఉన్నాడు. జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి టీజర్ విడుదలయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.


Also Read: వాలెంటైన్స్‌ డేకు లావణ్య ఇచ్చిన గిఫ్టెంటీ? - వరుణ్‌ తేజ్‌ షాకింగ్ రిప్లై!