Varun Tej About Valentine Gift From Wife: మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ఆపరేషన్‌ వాలెంటైన్‌ మూవీతో బిజీగా ఉన్నాడు. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన స్టోరీతో పాన్‌ ఇండియాగా ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ నిర్మించారు. వరుణ్‌ తేజ్‌ హిందీలో నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్  హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ శక్తి ప్రతాప్ సింగ్  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ నిర్మిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటుంది. 


మార్చి 1న ఆపరేషన్‌ వాలెంటైన్‌ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ మొదలు పెట్టాడు వరుణ్‌ తేజ్‌. ఈ మేరకు మల్లారెడ్డి కాలేజ్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులతో ఇంటారాక్ట్‌ అయ్యి మూవీని సరికొత్తగా ప్రమోట్‌ చేశాడు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్‌ కాగా ఈ షోకు యంకర్‌ సుమ హోస్ట్‌గా వ్యవహరించారు. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ కార్యక్రమంలో వరుణ్‌ తేజ్‌కు విద్యార్థుల నుంచి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. పెళ్లి తర్వాత మీ లేఫ్‌లో ఎలాంటి మార్పులు వచ్చాయని సుమ ప్రశ్నించింది. దీనికి వరుణ్‌ స్పందిస్తూ.. "పెళ్లి తర్వాత ఫోన్‌ కాల్స్‌ ఎక్కువగా వ్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్తుంటే చాలు ఎక్కడికి వెళ్తున్నారంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ, అవన్ని ప్రేమతోనే" అంటూ ముసిముసి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.


పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్‌ వాలంటైన్స్‌ డే కదా.. మీ భార్య లావణ్య నుంచి ఎలాంటి కానుక అందింది అని అడగ్గా.. ఈ ఏడాది తను ఏ కానుక ఇవ్వలేదు. నేను కూడా ఆమెకు ఏం ఇవ్వలేదు. కానీ వాలంటైన్స్‌ డే సందర్భంగా కాశ్మీర్‌కు వెకేషన్‌కు వెళ్లడం. ఆ స్పెషల్‌ డేను మంచు కొండల్లో సెలబ్రేట్‌ చేసుకున్నాం" అని చెప్పుకొచ్చాడు. గిఫ్టులు పెళ్లికి ముందు ఇచ్చుకున్నామని, కాలేజ్‌ టైంలో చాలానే ఇచ్చామన్నాడు. తానే అమ్మాయిలకు ఇచ్చానని, తనకే ఇవ్వలేదని అన్నాడు. ఇక తన సినిమా స్క్రిప్టు ఎంపికలో పెద్దనాన్న చిరంజీవిని ఫాలో అవుతానని, ఆయన స్ఫూర్తి స్క్రిప్ట్స్‌ ఎంపిక చేసుకుంటానని చెప్పాడు. 


Also Read: మళ్లీ పెళ్లీ పీటలు ఎక్కబోతున్న డైరెక్టర్‌ శంకర్‌ కూతురు - మూడేళ్ల క్రితం క్రికెటర్‌తో పెళ్లి, విడాకులు


అనంతరం ఆపరేషన్‌ వాలెంటైన్‌ గురించి చెబుతూ.. "దేశాన్ని రక్షించే మన సైనికుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. వాస్తవ పరిస్థితులను చూపించే అవకాశం అరుదుగా వస్తుంది. ఈ సినిమా కంటే ముందు పుల్వామా ఎటాక్‌ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ముఖ్యంగా యువతకు ఇలాంటి చిత్రాలు చాలా అవసరం. ఇలాంటి సినిమాలో భాగమవడం నా అదృష్టం. సీరియస్‌ మాత్రమే కాదు.. ఈ చిత్రాన్ని కామెడీ కోణంలోనూ తెరకెక్కించాం. ఇలాంటి తరహాలో చాలా సినిమాలు వచ్చాయి కదా అని అడగ్గా.. ప్రేమకథా చిత్రాలు, కమర్షియల్‌ సినిమాలు ఎన్నైనా తీస్తున్నప్పుడు రియల్‌ హీరోపై ఎందుకు తీయకూడదని అడిగా. ఈ సినిమా నాకెన్నో జ్ఞాపకాలు ఇచ్చింది. ఈ సినిమా పాటను వాఘా బోర్డర్‌లో విడుదల చేయడం ఆనందాన్నిచ్చింది. ప్రతి ఒక్కరు వాఘా బోర్డర్‌ను సందర్శించండి. ఎందుకంటే యువతకు దేశభక్తి చాలా ముఖ్యం. బీఎస్‌ఎఫ్‌ జవాన్లను కలుసుకోవడం నాకు మంచి అనుభూతినిచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు.