Director Shankar Daughter: తమిళ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు మళ్లీ పెండ్లిపీటలు ఎక్కబోతోంది. మొదటి భర్తతో విడిపోయిన ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య తాజాగా అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్‌తో రెండో వివాహానికి సిద్ధమయ్యింది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని శంకర్ రెండో కూతురు అదితి శంకర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అలాగే ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వృత్తి రీత్యా డాక్టర్ అయిన శంకర్ పెద్ద కూతురు గతంలో క్రికెటర్ రోహిత్ దామోదరన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2021లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
అయితే పెళ్లయిన కొద్ది రోజులకే వీరిమధ్య అభిప్రాయబేధాలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. పెళ్లికి ముందే క్రికెటర్ దామోదరన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే పెళ్లి అనంతరం కూడా అతడిపై మళ్లీ ఇవే ఆరోపణలు వచ్చాయి. అతడు నిర్వహిస్తున్న క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో మహిళా ఆటగాళ్లతో అసభ్యంగా ప్రవర్తించారనే ఫిర్యాదులు రావడంతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. దీంతో రోహిత్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పట్నుంచి ఐశ్వర్య తండ్రి దగ్గరనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు రెండో పెండ్లికి సిద్ధమయ్యింది. తాజాగా ఇంగేజ్‌మెంట్ కూడా జగరడంతో పలువురు సెలబ్రెటీలు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తరుణ్ కార్తికేయన్ కేవలం అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే కాదు. పాటల రచయిత, ప్లే బ్యాక్ సింగర్ కూడా.
Also Read: ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలదే హవా - బాక్సాఫీసు వద్ద కమెడియన్స్ ఢీ!
తమిళ డైరెక్టర్ శంకర్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. దక్షణాది సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన కొద్దిమంది దర్శకులలో శంకర్ ఒకరు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలంతా ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని కోరుకొనేంత దిగ్గజ దర్శకుడు ఆయన. 1993లో జెంటినల్ మేన్ సినిమాతో డైరెక్టర్ గా మారిన ఈయన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, నాయక్, బాయ్స్, ప్రేమిస్తే, అపరిచితుడు, శివాజీ, రోబో, స్నేహితుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం గమే ఛేంజర్ తో పాటు భారతీయుడు 2 కూడా తెరకెక్కిస్తున్నారు. కెరియర్ పరంగా సూపర్ సక్సెస్ సాధించిన ఆయనకు మొత్తం ముగ్గురు పిల్లలు. వారితో ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ డాక్టర్‌గా కాగా.. చిన్న కూతురు ఆదితి శంకర్ తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇప్పటికే హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. అంతేకాదు సింగర్‌గా కూడా ఆమె రాణిస్తుంది.